తొలిరోజే 95.6% మందికి పోలియో చుక్కలు
రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమానికి విశేషస్పందన లభించింది. తొలిరోజు ఈ ఐదుజిల్లాల్లో 17,21,545 మంది ఐదేండ్లలోపు చిన్నారులకు ఆరోగ్య సిబ్బంది పోలియో చుకలు వేశారు.
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమానికి విశేషస్పందన లభించింది. తొలిరోజు ఈ ఐదుజిల్లాల్లో 17,21,545 మంది ఐదేండ్లలోపు చిన్నారులకు ఆరోగ్య సిబ్బంది పోలియో చుకలు వేశారు. మొత్తం 18,01,698 మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలిరోజే 95.6 శాతం లక్ష్యాన్ని సాధించారు. పోలియోబూత్లతో పాటు బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్ల వంటి ట్రాన్సిట్ పాయింట్ల వద్ద కూడా వ్యాక్సినేషన్ చేపట్టారు.
ఐదు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 16,83,380 మంది చిన్నారులకు పోలియో బూత్‌లలో, 21,369 మందికి ట్రాన్సిట్ పాయింట్ల వద్ద, 16,796 మందికి మొబైల్ టీమ్‌ల ద్వారా వ్యాక్సిన్ అందించారు. మొత్తం 17,21,545 మంది చిన్నారులు పోలియో చుకలు వేయించుకున్నారు. కార్యక్రమ నిర్వహణ కోసం 7,428 పోలియోబూత్లు, 245 ట్రాన్సిట్పాయింట్లు, 245 మొబైల్ టీమ్‌లను ఏర్పాటుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

