నేడు చేనేతల రౌండ్ టేబుల్ సమావేశం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, చేనేత కళాకారులపై జరుగుతున్న వివక్షపై సోమవారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు చేనేత దినోత్సవం వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, చేనేత కళాకారులపై జరుగుతున్న వివక్షపై సోమవారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు చేనేత దినోత్సవం వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్లలో చేనేత కళాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని, గత ప్రభుత్వ హయాంలో అమలైన థ్రిఫ్ట్ ఫండ్ సీమ్, యార్న్ సబ్సిడీ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు.
చేనేత టెండర్ విధానాన్ని తీసుకువచ్చి చేనేత కార్మికుల ఉపాధిని పూర్తిగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా చేనేత కళాకారుల సంక్షేమం, అభివృద్ధి విషయంలో తీవ్ర వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. ఈ అంశాలపై సమగ్రంగా చర్చించి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నామని, అఖిలపక్ష నేతలు పెద్దఎత్తున హాజరై ఉద్యమ భాగస్వాములు కావాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

