లాభాల స్వీకరణ దిశగా..!
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,327.26 పాయింట్లు పెరిగి 83,919.71 వద్ద నిలిచింది.
- మార్కెట్ పల్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,327.26 పాయింట్లు పెరిగి 83,919.71 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 656.30 పాయింట్లు అందుకొని 25,800.60 దగ్గర ఆగింది. విదేశీ మదుపర్ల నుంచి పెట్టుబడుల ప్రవాహం, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ముడి చమురు ధరలు, డాలర్‌తో పోలిస్తే బలపడిన రూపాయి మారకం విలువ, ఆకట్టుకున్న బ్యాంకింగ్ షేర్లు కలిసొచ్చాయి. అయితే ద్రవ్యోల్బణం సవాళ్లు, వచ్చే నెల రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు అంచనాల మధ్య ఈ వారం లాభాల స్వీకరణకు వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుని ముడి చమురు ధరలు పెరిగితే సూచీలు నష్టాల్లోకి జారుకోవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్టీ, స్టీల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చన్నది ఎక్స్పర్ట్స్ మాట. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 25,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 25,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల అంచనా. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 26,000-26,200 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న వివరాలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

