Home
National
Uttar Pradesh Police Mistakenly Give Guard Of Honour To Asaduddin Owaisi Instead Of Supreme Court Judge
జడ్జి అనుకుని ఒవైసీకి గౌరవ వందనం
ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి స్వాగతం పలికేందుకు సిద్ధమైన పోలీసులు పొరపాటున ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి గౌరవ వందనం సమర్పించారు.
- యూపీ పోలీసుల పొరపాటు
సహారన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి స్వాగతం పలికేందుకు సిద్ధమైన పోలీసులు పొరపాటున ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి గౌరవ వందనం సమర్పించారు. శనివారం స్థానిక సర్క్యూట్ హౌస్‌లో ఈ ఘటన జరిగింది. ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్‌ను కలిసేందుకు ఒవైసీ తన భద్రతా సిబ్బందితో కలిసి సర్క్యూట్ హౌస్‌కు వచ్చారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాక నేపథ్యంలో పోలీసులు ఆయనకు గౌరవ వందనం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒవైసీని న్యాయమూర్తి రాకగా పొరబడిన సిబ్బంది వెంటనే సెల్యూట్ చేస్తూ, గౌరవ వందనం సమర్పించారు. పోలీసులు తనకు సెల్యూట్ చేయడాన్ని గమనించిన ఒవైసీ అక్కడే ఆగిపోయారు. కదలకుండా నిలబడి వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

