‘భోగి’ నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా
‘సినిమా ఫస్ట్ కాపీ చూశాక పూర్తి సంతృప్తిగా ఫీలయ్యా. అంత అద్భుతంగా తీశాడు సంపత్‌నంది. డబ్బింగ్ పూర్తి చేశా. తల్లిలాంటి తెలంగాణ శ్లాంగ్ని జాగ్రత్తగా మాట్లాడా. టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. అనుపమ, డింపుల్ పాత్రలు విభిన్నంగా ఉంటాయి.
‘సినిమా ఫస్ట్ కాపీ చూశాక పూర్తి సంతృప్తిగా ఫీలయ్యా. అంత అద్భుతంగా తీశాడు సంపత్‌నంది. డబ్బింగ్ పూర్తి చేశా. తల్లిలాంటి తెలంగాణ శ్లాంగ్ని జాగ్రత్తగా మాట్లాడా. టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. అనుపమ, డింపుల్ పాత్రలు విభిన్నంగా ఉంటాయి. దర్శకులు గుణ్ణం గంగరాజు, దేవ కట్టా, సుజీత్‌ల తర్వాత నాలోని కొత్త నటుడ్ని ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుడు సంపత్ నంది. తనకు నిజంగా థ్యాంక్స్. ‘భోగి’ నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా’ అని హీరో శర్వానంద్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన తెలంగాణ నేపథ్య పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలు. సంపత్‌నంది దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ నెల 27న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో శర్వానంద్ మాట్లాడారు.
దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ ‘ఇది సంక్రాంతి ముందొచ్చే ‘భోగి’ కాదు. చెడును చంపిన తర్వాత వచ్చే ‘భోగి’. 1960లో మహారాష్ట్ర సరిహద్దులో ఉండే బొగ్గలగుట్ట అనే గ్రామంలో చాలాకాలంగా ఉన్న బానిసత్వాన్ని, కొన్ని నమ్మకాల్నీ భోగి మంటల్లో వేసి, ఊరికి కొత్త వెలుగునిచ్చిన ఓ వ్యక్తి కథ ఇది. అన్నచెల్లెళ్ల ఎమోషన్సే ఈ సినిమాకు ప్రధానబలం. మూస కమర్షియల్ ఫార్ములాలను పక్కనపెట్టి ఈ సినిమా కోసం కొత్తగా ట్రై చేశాను. శర్వానంద్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇందులో చూస్తారు. నేషనల్ అవార్డ్ స్థాయిలో ఆయన నటన ఉంది. అవార్డు వస్తుందని ఆశిస్తున్నా. టీమ్ అంతా ప్రాణం పెట్టారు. ఆ కష్టాన్నంతా రేపు తెరపై చూస్తారు’ అని నమ్మకంగా చెప్పారు. ఇంకా అతిథిగా విచ్చేసిన డోర్నకల్ శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రనాయక్‌తోపాటు కథానాయిక డింపుల్ హయాతి, నిర్మాత కె.కె.రాధామోహన్, గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు భీమ్స్సిసిరోలియో తదితర చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

