విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు
కులవివక్ష, వేధింపులు, ఆర్థిక ఇబ్బందులకు కుంగిపోయి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదురోవాలని బీఆర్ఎస్ నాయకుడు, స్వేరోస్ వ్యవస్థాపకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు.
- స్వేరోస్ వ్యవస్థాపకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- హనుమకొండలో ఆత్మీయ సమ్మేళనం
హనుమకొండ, నవంబర్ 22 : కులవివక్ష, వేధింపులు, ఆర్థిక ఇబ్బందులకు కుంగిపోయి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదురోవాలని బీఆర్ఎస్ నాయకుడు, స్వేరోస్ వ్యవస్థాపకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో ఆత్మసె్థైర్యం నింపి, వారిని విజయపథంలో నడిపించేందుకు ‘ప్రేరణ’ కార్యక్రమం దిక్సూచిగా నిలుస్తుందని పేరొన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన స్వేరోస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు స్వేరోస్ గీతంతో పాటు శూన్యం, స్మరణ, కర్మ, నిధి, వ్యూహం, వీడోలు అనే ఏడు సూత్రాలతో ప్రేరణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులతో ఎండీ రేడియాలజీ చదువు ఆగిపోయే పరిస్థితిలో ఉన్న పూజితకు స్వేరోస్ సభ్యులు రూ.లక్ష సమకూర్చడం అభినందనీయమన్నారు.
మరణించిన ఆటో డ్రైవర్ గురవయ్య కుటుంబానికి ‘భీమ్ హోమ్’ పేరుతో ఇల్లు నిర్మించడం స్వేరోస్ సేవా స్ఫూర్తికి నిదర్శనమని పేరొన్నారు. గురుకుల పాఠశాలలో నుంచి ఢిల్లీ యూనివర్సిటీలో చదివి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ సోని, ఎలాన్ మస్క్ సంస్థలో పని చేసి సొంత కంపెనీలు స్థాపించిన రాణి, పైలట్‌గా ఎదిగిన ఆటో డ్రైవర్ కూతురు ఆపేక్ష విజయాలను ఆయన సభకు వివరించారు. కులవివక్ష, వేధింపుల కారణంగా మహబూబాబాద్‌కు చెందిన సుస్మిత, పరకాలకు చెందిన ఏకు శ్రీవాణి, భువనగిరికి చెందిన బచ్చలకూర శ్రీకాంత్ సహా 153 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, బడుగు వర్గాలకు మంచి రోజులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

