పంట ఎండిందని రైతు ఆత్మహత్య
చిన్నశంకరంపేటలో విషాదంచిన్నశంకరంపేట, నవంబర్ 22: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది.
- చేతికందే దశలో ఎండిన వరి
- అప్పుల బాధతో బలవన్మరణం
చిన్నశంకరంపేటలో విషాదంచిన్నశంకరంపేట, నవంబర్ 22: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. చిన్నశంకరంపేటకు చెందిన వడ్డె నారాయణ తనకున్న రెండెకరాల్లో వరి వేశాడు. పంట సాగు, కుటుంబ పోషణ కోసం రూ.2 లక్షలకు పైగా అప్పు చేశాడు.
పంట చేతికందే దశలో నీళ్లు లేక ఎండిపోవడం, పెండ్లీడుకు వచ్చిన కూతురు ఉండటం, అప్పుల వాళ్లు వేధించడంతో తీవ్ర మనోవేదనకు గురై నారాయణ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొన్నాడు. ఆయనకు భార్య యశోద, ముగ్గురు కుమార్తెలు రేణుక, గాయత్రి, లక్ష్మి ఉన్నారు. పెద్దకూతురు రేణుక అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్సై శివానందం కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

