ఉసిరి చెట్టు నీడలో..
అంటే కార్తిక మాసం శుక్లపక్షంలో వనభోజనం చేసినవారు పాపాల నుంచి విముక్తి పొంది విష్ణు లోకాన్ని పొందుతారని కార్తిక పురాణం చెబుతున్నది. కార్తిక మాసంలో శ్రీలక్ష్మి, నారాయణులిద్దరూ ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని విష్ణుపురాణ కథనం. ఉసిరి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.
- ధర్మ సందేహం
కార్తిక మాసంలో వన భోజనం ప్రాధాన్యాన్ని వివరించండి.
సుప్రదీప్త్, హైదరాబాద్
యః కార్తికే సితే పక్షే, వనభోజన మాచరేత్
సయాతి వైష్ణవం ధామం, సర్వ పాపైః ప్రముచ్యతే॥
అంటే కార్తిక మాసం శుక్లపక్షంలో వనభోజనం చేసినవారు పాపాల నుంచి విముక్తి పొంది విష్ణు లోకాన్ని పొందుతారని కార్తిక పురాణం చెబుతున్నది. కార్తిక మాసంలో శ్రీలక్ష్మి, నారాయణులిద్దరూ ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని విష్ణుపురాణ కథనం. ఉసిరి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఉసిరి చెట్టును దైవంగా భావిస్తారు. అందుకే వన భోజన సమయంలో ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని గానీ, విగ్రహాన్ని గానీ ఉంచి పూజలు చేసి, అందరూ కలిసి భోజనాలు చేయడం ఆచారంగా మారింది. శ్రీకృష్ణుడు తన సోదరుడైన బలరాముడు, ఇతర గోపబాలురతో కలిసి యమునా తీరం బృందావనంలో ఉసిరి మొదలైన వృక్షాల నీడలో వనభోజనం చేసినట్లుగా భాగవతం పేర్కొన్నది. సూత మహర్షి శౌనకాది మునులతో కలిసి నైమిశారణ్యంలో కార్తిక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనం చేశారని కార్తిక పురాణ కథనం. యుగయుగాలుగా వస్తున్న వనభోజన సంప్రదాయంలో ఆధ్యాత్మిక ఆనందంతోపాటు నలుగురితో కలిసిపోయే సామాజిక చైతన్యమూ ఉంది.
శ్యామ్‌ప్రసాద్ …?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

