ట్రెఫాయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం
చందనవెళ్లి-హైతాబాద్ గ్రామాల మధ్య ఉన్న ట్రెఫాయిల్ కంపెనీలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది.
షాబాద్: చందనవెళ్లి-హైతాబాద్ గ్రామాల మధ్య ఉన్న ట్రెఫాయిల్ కంపెనీలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో కంపెనీలో మంటలు చెలరేగడంతో కార్మికులందరూ ఒక్కసారిగా ఉరుకులు పరుగులు తీశారు. ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని దవాఖానకు తరలించారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, షాద్నగర్ చేవెళ్ల నుంచి మూడు అగ్నిమాపక యంత్రాలు వచ్చి రెండున్నర గంటలు కష్టపడి మంటలను ఆర్పి వేశాయి. దీంతో కంపెనీ యాజమాన్యం సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. చందనవెళ్లి పారిశ్రామిక వాడలో సుమారు వందకు పైగా కంపెనీలు ఉన్నాయని, ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించేలా హైతాబాద్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు యాదయ్య, రాజుగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

