నరక హరణం జ్వాలా తోరణం
కార్తిక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి, ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు.
లోక కంటకులైన త్రిపురాసురులను సంహరించి కైలాసానికి విజయం చేసిన పరమేశ్వరునికి జ్వాలా తోరణంతో స్వాగతం చెప్పింది పార్వతీ మాత. స్వామికి తగిలిన దిష్టి ఈ రకంగా అమ్మవారు తొలగించింది. అప్పటినుంచి కార్తిక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం నిర్వహించడం శైవ క్షేత్రాలలో ఆనవాయితీగా మారింది.
కార్తిక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి, ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు. మన పూర్వికులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. దీనిని తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తిక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదని పురాణ కథనం. జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో, గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో భద్రంగా పెడతారు. శివస్పర్శ ఉన్న ఈ భస్మం ఉన్నచోటికి ఉగ్రభూతాలు ప్రవేశించలేవు. ఇది ఉన్న ప్రాంతంలో సుఖశాంతులు కలుగుతాయి. తోరణానికి మిగిలిన ఎండుగడ్డిని, సగం కాలిన గడ్డిని కూడా రైతులు గడ్డివాములలో కలుపుతారు. ఆ వాములలోని గడ్డిని మేసిన పశుసంతతి బాగా అభివృద్ధి చెందుతుందని నమ్మిక.
భారతి…?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

