కవెందుకు?
చేతులకు సంకెళ్లు వేసి రాయమంటారు సంకెళ్లను ఛేదించే పిడికిలి కదా కవి
చేతులకు సంకెళ్లు వేసి
రాయమంటారు
సంకెళ్లను ఛేదించే పిడికిలి కదా కవి
భావాలను తమదైన చట్రాల్లోకి కుదించి
చూపమంటారు
చట్రాలను ఛేదించుకుని
స్వేచ్ఛకు దారి చూపించే దిక్సూచి కదా కవి
ప్రశ్నలొద్దు..అన్నీ సమాధానాలే ఉండేలా
ఉటంకించమంటారు
ప్రశ్నించడం నేర్పేవాడే కదా కవి
విమర్శలొద్దు..అన్నీ ప్రశంసలే
చేయమంటారు
ప్రశంసల ముసుగుల్ని చీల్చి
నిజాల నిగ్గు తేల్చే కరవాలం కదా కవి
ప్రభువులను స్తుతించే భజన గీతాలే
వినిపించమంటారు
బతుకు కల్లోలాల్ని బయటపెట్టే
ప్రజల గొంతు కదా కవి
అన్నీ తాము చెప్పినట్టే చేస్తే
ఇంక కవెందుకు? కవిత్వమెందుకు?
పూయమన్నట్టు పూస్తే పువ్వు కాదు
కురవమన్నట్టు కురిస్తే వర్షం కాదు
ఉరమమన్నట్టు ఉరిమితే ఆకాశం కాదు
ఉప్పొంగమన్నట్టు ఉప్పొంగితే సముద్రం కాదు
వంగి వంగి సలాములు చేయమంటే ఎలా?
నిటారుగా నిలబడగలిగితేనే కదా కవి
మసి పూసి మారేడుకాయను చేయమంటే ఎలా?
ఈ ప్రపంచపు నిజాల నిఘా కెమెరా కదా కవి
అన్నీ తమరికనుకూలంగా రాయమని ఆదేశిస్తే ఎలా?
అనధికార శాసనకర్త కదా కవి
చిత్తలూరి
9133832246
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

