నా అందమైన చాందినీ
బ్రిటిషోడికి సౌతాఫ్రికాలో గోల్డ్ మైన్స్ దొరికినట్టు ఎండ తాపానికి గొంతెండుతున్న మనిషికి
బ్రిటిషోడికి సౌతాఫ్రికాలో గోల్డ్ మైన్స్ దొరికినట్టు
ఎండ తాపానికి గొంతెండుతున్న మనిషికి
చల్లటి కిన్లీ బాటిల్ చేతికి అందినట్టు
ఎండిన పేగులకు ఖుర్షీద్ బిర్యానీ దొరికినట్టు
నైట్ పూట నరకం నాలుగు దిక్కుల కనపడే
నాకు ఓ అందమైన చాందిని ఎదురుపడింది
కళ్యాణి స్వీట్హౌస్లో కలకందలా
శంభునిపేట చౌరస్తాలో గరం గరం జిలేబీలా
ఆమె మాటల మధువుల తోటి
పచ్చికొమ్మను మెలిపెట్టినట్టు నా మనసును
మెలిపెట్టి నా గుండెల్లో గూడు కట్టుకుంది
కనుబొమ్మలు ఎగిరేస్తూ కాశ్మీర్ యాపిల్లా
కనిపిస్తూ నా కాళ్లను ఖైదీని చేసింది
ఆమె చురుకైన చూపుల గాలాలను విసిరేసి
నా ఎదపై పచ్చబొట్టు పొడిచింది
ఆమె పెదాలపై తియ్యని పదాలను పలుకుతూ
నా మదిని బొంగరంలా తిప్పేసింది
కండ్లు మాత్రమే కనపడే ఆమె
నా జ్ఞాపకాల పుస్తకంపై సంతకం చేసింది
పొద్దున్నే పొద్దుపొడుపును చూడకుండా గ్యాలరీలో
ఆమె ఫొటోను చూస్తూ నా దినచర్య ముల్లును కదిలిస్తాను
మొదటిసారి ఆమె ఇచ్చిన బహుమతిని
నా అల్మారాలో భద్రంగా దాచుకున్నాను
భూమి మీద ఇంకొన్నాళ్లే ఉంటాము
మట్టిలో కలిసే వరకు మనం కలిసుందాం
మన వలపులే తలుపులుగా చేసుకుంటూ
జీవితంలో సాగిపోదాం
తాటిపాముల రమేశ్ (తార)
7981566031
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

