పీపీఎఫ్‌పై లోన్ కావాలా.. వడ్డీరేటు, నిబంధనలు తెలుసుకోండి
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది పెట్టుబడికున్న ఓ అవకాశం మాత్రమే కాదు.. దీర్ఘకాలంలో పన్ను రహిత రిటైర్మెంట్ నిధి సృష్టికీ చక్కని మార్గం. అలాగే ఖాతా తెరిచిన 3-6 ఆర్థిక సంవత్సరాల మధ్య అప్పటిదాకా ఉన్న నగదు నిల్వలపై రుణ సదుపాయాన్ని కూడా తీసుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది పెట్టుబడికున్న ఓ అవకాశం మాత్రమే కాదు.. దీర్ఘకాలంలో పన్ను రహిత రిటైర్మెంట్ నిధి సృష్టికీ చక్కని మార్గం. అలాగే ఖాతా తెరిచిన 3-6 ఆర్థిక సంవత్సరాల మధ్య అప్పటిదాకా ఉన్న నగదు నిల్వలపై రుణ సదుపాయాన్ని కూడా తీసుకోవచ్చు. బ్యాలెన్స్‌లో 25 శాతాన్ని అప్పుగా పొందవచ్చు. విశేషమేమిటంటే.. అప్పు తీసుకున్న మూడేండ్ల (36 నెలలు)లోపు తిరిగి చెల్లిస్తే వార్షిక వడ్డీరేటు మన డిపాజిట్లపై వస్తున్న వడ్డీరేటు కంటే 1 శాతం మాత్రమే ఎక్కువ. చెల్లించకపోతే మిగిలిన రుణ బకాయిలపై అదనంగా 6 శాతం వార్షిక వడ్డీరేటు పడుతుంది.
ఉదాహరణకు పీపీఎఫ్ ఖాతాను తెరిచిన మూడేండ్ల తర్వాత ఖాతాలో రూ.2 లక్షల బ్యాలెన్స్ ఉన్నది. దీనికి వర్తిస్తున్న వార్షిక వడ్డీరేటు 7.1 శాతం. ఇక పీపీఎఫ్ బ్యాలెన్స్‌లో 25 శాతాన్ని (రూ.50,000) లోన్‌గా తీసుకోవచ్చు. అయితే ఈ రుణాన్ని మూడేండ్లలోపు చెల్లిస్తే వార్షిక వడ్డీరేటు 8.1 శాతమే పడుతుంది. ఒకవేళ చెల్లించకపోతే ఇంకా మిగిలి ఉన్న రుణ బకాయిలపై 13.1 శాతం వడ్డీని కట్టాల్సి వస్తుంది. అలాగే లోన్ తీర్చేదాకా పీపీఎఫ్ బ్యాలెన్స్‌లో ఆ రుణ బకాయిలకు సమానమైన నగదు నిల్వలకు వడ్డీ ఆదాయం రాదు.

అంటే.. మొదట్లో రూ.50,000పోను ఉన్న రూ.1.50 లక్షలకే 7.1 శాతం వడ్డీ ఆదాయం పొందగలం. లోన్ తగ్గుతున్నకొద్దీ.. పెరిగే పీపీఎఫ్ బ్యాలెన్స్ నిల్వలనుబట్టి వడ్డీ ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతో మనం తీసుకున్న లోన్‌పై చెల్లించే వడ్డీరేటు 1 శాతంగానే పరిగణించవచ్చు. మూడేండ్లలోపు చెల్లించకపోతే మాత్రం ఆ వడ్డీ భారం 6 శాతానికి పెరుగుతుంది. పీపీఎఫ్ పాస్‌బుక్‌తోపాటు ఫామ్ డీని మీ పీపీఎఫ్ ఖాతా ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్ శాఖలో సమర్పించి లోన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

- ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారే లోన్ తీసుకోవచ్చు. దాన్ని మొత్తం తీర్చేస్తేనే మళ్లీ అప్పు తీసుకోగలం.
- తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించే వరకు పీపీఎఫ్ బ్యాలెన్స్‌లో దానికి సమాన మొత్తానికి వడ్డీ ఆదాయం రాదు.
- ఖాతాలోని నగదు నిల్వల ఆధారంగానే తీసుకునే రుణ మొత్తాలు ఆధారపడి ఉంటాయి.
- కనీస వార్షిక పెట్టుబడి రూ.500. గరిష్ఠంగా రూ.1.50 లక్షలు.
- ప్రస్తుత వార్షిక వడ్డీరేటు 7.1 శాతం. ఏటా చక్రవడ్డీ ప్రయోజనాలుంటాయి. 3 నెలలకోసారి ప్రభుత్వం సమీక్షించి ప్రకటిస్తుంది.
- మెచ్యూరిటీ వ్యవధి 15 పూర్తి ఆర్థిక సంవత్సరాలు. ఆ తర్వాత ఐదేండ్ల చొప్పున పెంచుకోవచ్చు.
- పాత ఆదాయ పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు.
- భారతీయ పౌరులు పీపీఎఫ్ ఖాతాను తెరుచుకోవచ్చు. మైనర్లు వారి సంరక్షకుల ద్వారా నిర్వహించుకోవచ్చు.
- ప్రవాస భారతీయులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు అవకాశం లేదు.
- పేర్కొన్న నిబంధనలకు లోబడి 7వ ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక ఉపసంహరణలకు వీలుంటుంది.
- ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 5లోపు ఎంచుకున్న వార్షిక పెట్టుబడిని చెల్లిస్తేనే పూర్తి వడ్డీరేటు ప్రయోజనం.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

