బిస్లరీ వాటర్ సురక్షితమేమీ కాదు!
బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (మినరల్ వాటర్ కాకుండా) సురక్షితం కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదివారం ప్రకటించింది. బిస్లరీ ప్రాంగణం నుంచి సేకరించిన ‘ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్' శాంపిల్ నిర్దేశిత భద్రతా ప్రమాణాల్లో విఫలమైనట్టు సంస్థ సోషల్ మీడియా పోస్టులో తెలిపింది.
- పరిమితికి మించి బ్రోమేట్ స్థాయిలు ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడి
- చట్టపరమైన చర్యలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి
న్యూఢిల్లీ, నవంబర్ 22 : బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (మినరల్ వాటర్ కాకుండా) సురక్షితం కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదివారం ప్రకటించింది. బిస్లరీ ప్రాంగణం నుంచి సేకరించిన ‘ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్’ శాంపిల్ నిర్దేశిత భద్రతా ప్రమాణాల్లో విఫలమైనట్టు సంస్థ సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. దీంతో బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్టపరమైన చర్యలకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొంది. ‘నమూనాలో బ్రోమేట్ పరిమితులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది.
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం దీనిని సురక్షితం కానిదిగా ప్రకటించాం’ అని పేర్కొన్నది. దీనిపై కంపెనీ అప్పీల్ చేయడంతో, నమూనాను మరిన్ని పరీక్షల కోసం రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపారు. ఆ ల్యాబ్‌లోనూ పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు గుర్తించడంతో నమూనా ‘సురక్షితం కాదు’ అని ప్రకటించిందని నియంత్రణ సంస్థ తెలిపింది. ఆహార భద్రత నిబంధనలు, నియమావళిని పాటించలేదని ఊర్మి లైఫ్‌సైన్సెస్ ఎల్ఎల్పీ, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ల లైసెన్సులను సంస్థ సస్పెండ్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

