అచ్చ విద్యాసాగర్ కుటుంబానికి అండగా ఉంటాం
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత అచ్చ విద్యాసాగర్ కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు.
- తెలంగాణ ఉద్యమకారుడికి కేటీఆర్ నివాళి
కరీమాబాద్, నవంబర్ 22 : తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత అచ్చ విద్యాసాగర్ కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆదివారం ఖిలా వరంగల్‌లోని తూర్పుకోటలోని అచ్చ విద్యాసాగర్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యాసాగర్ తల్లి సుగుణమ్మ, భార్య శిరీష, కుమార్తెలు నవ్య, నందిని, అక్షయను పరామర్శించి ఓదార్చారు.
అంతకుముందు శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు అచ్చ విద్యాసాగర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ నెల 18న అనారోగ్యంతో అచ్చ విద్యాసాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. కేటీఆర్ వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, బాల్క సుమన్, పార్టీ నేతలు నాగుర్ల వెంకన్న, రాకేశ్‌రెడ్డి, చింతం సదానందం ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

