మంత్రి అడ్లూరితో సంక్షేమ శాఖ నిర్వీర్యం
రాష్ట్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సంక్షేమ శాఖను నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కేటీఆర్ సోషల్ మీడియాకే పరిమితం కాదని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్న నాయకుడని ప్రశంసించారు.
- కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు
- కమీషన్ల కోసమే న్యూ ఇండియా ఇంటిగ్రేటెడ్ సీమ్ : కొప్పుల
జగిత్యాల, నవంబర్ 22 : రాష్ట్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సంక్షేమ శాఖను నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కేటీఆర్ సోషల్ మీడియాకే పరిమితం కాదని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్న నాయకుడని ప్రశంసించారు. కేటీఆర్‌తో మంత్రి అడ్లూరి ఎందులోనూ సరిపోరని చెప్పారు. జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత లక్ష్మణ్‌కుమార్‌కు ఉందా..? అని ప్రశ్నించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తున్న లక్ష్మణ్ కుమార్ ధర్మపురి అభివృద్ధిలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, పట్టణాలు, నగరపాలక సంస్థలకు అవసరమైనన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. లక్ష్మణ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురిని మున్సిపాలిటీగా చేసింది కేటీఆరేనని తెలిపారు.
ఈ మున్సిపాలిటీలో ప్రస్తుతం ఖర్చు చేస్తున్న 25 కోట్ల నిధులు కూడా ఆయన ఇచ్చినవేనని, వాటికే మాడిఫికేషన్ పేరిట పనులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా తీసుకురాలేదని ఆరోపించారు. సోషల్ వెల్ఫేర్, వికలాంగుల శాఖతో పాటు ఇతర శాఖలు నిర్వహిస్తున్న మంత్రి అడ్లూరి ఇప్పటివరకు గురుకులాల్లో 110 మంది పిల్లలు చనిపోయినా పట్టించుకోలేదని మండిపడ్డారు. గురుకులాలను నిర్వీర్యం చేయడం కోసం న్యూ ఇండియా ఇంటిగ్రేటెడ్ సీమ్ తీసుకొచ్చారని ఆరోపించారు. కమీషన్ల కోసమే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ సూల్ బిల్డింగ్‌ను రూ.250 కోట్లతో నిర్మిస్తున్నారని చెప్పారు. 2025-26లో దివ్యాంగులకు కేటాయించిన బడ్జెట్లో రూ.58 కోట్లకు సంబంధించిన టోకెన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని పేరొన్నారు. నర్సింగ్ సూళ్లలో చదువుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సాలర్ షిప్ అందేలా తాను మంత్రిగా ఉన్నప్పుడు 2021లో జీవో 7 తెచ్చామని, దాన్ని ఆపి, 275 నర్సింగ్ సూళ్ల యాజమాన్యాలతో కమీషన్ల కోసం ఆటలాడుకుంటూ ఒక సంవత్సరమే ఎక్స్టెన్షన్ ఇచ్చారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

