సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను అడ్డుకున్న రైతులు
ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించిన తర్వాతే కాలువ పనులు చేసుకోవాలని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కమలాపురంలో సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను ఆదివారం రైతులు అడ్డుకున్నారు.
కారేపల్లి, నవంబర్ 22 : ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించిన తర్వాతే కాలువ పనులు చేసుకోవాలని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కమలాపురంలో సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను ఆదివారం రైతులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు లో భాగంగా 45 మంది రైతులకు చెందిన 54 ఎకరాల భూమికి 2021లో అధికారులు అవార్డు ప్రకటించారు. ఎకరానికి రూ.10.50 లక్షల చొప్పున పరిహారాన్ని ఈ ఏడాది ఆగస్టు 25న వారి బ్యాంకుల్లో జమ చేశారు.
ఆ భూముల్లో రైతులు వరి, పత్తి వేయగా చేతికొచ్చే దశలో ఉండగా జేసీబీలతో అధికారులు కాలువ పనులు చేపట్టడంతో రైతులు అడ్డుకున్నారు. మారెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని, పక మండలంలో ప్రకటించినట్టు తమకు కూడా రూ.19.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములను రెవెన్యూశాఖ తమకు అప్పగించిందని, ఆగస్టులోనే పరిహారం చెల్లించినా సరిపోలేదని రైతులు కోర్టును ఆశ్రయించారని ఏఈ సందీప్ చెప్పారు. దీనిపై తమకు ఎలాంటి ఆ దేశాలు అందలేదని, పంట చేతికొచ్చే వరకు ఖాళీ భూముల్లో పనులు చేస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

