OTT | సెప్టెంబర్ నాలుగో వారంలో ఓటీటీ (OTT)లో హిందీ, ఇంగ్లిష్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. జియో హాట్‌స్టార్, జీ5, నెట్‌ఫ్లిక్స్ తదితర ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమాలు రానున్నాయి. వీటిలో రొమాన్స్, కామెడీ, క్రైమ్ డ్రామా, రియాలిటీ షో వంటివి ఉన్నాయి. ఇవి సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
మినర్వా అకాడమీ: ఇది ఇటాలియన్ డ్రామా సినిమా. నేపుల్స్‌లోని ఒక మిలిటరీ హైస్కూల్ నేపథ్యంలో సాగుతుంది. వేర్వేరు కుటుంబ నేపథ్యాలు ఉన్న సాల్వో, విన్సెంజో, కామిల్లా అనే మగ్గురు టీనేజర్లు ఈ హైస్కూలులో చేరుతారు. కఠినమైన డిసిప్లీన్, కుటుంబ ఒత్తిడి, అకాడమీలోని రహస్యాలను అనుసరించి ఇది సాగుతుంది.
ఇది సెప్టెంబర్ 22న విడుదల కానున్నది.
హెబియస్ కార్పస్: పోర్చుగీస్ లీగల్ డ్రామా. లా ప్రొఫెసర్, మాజీ డిఫెన్స్ లాయర్ అయిన లినెజ్ నాయకత్వంలో విద్యార్థుల బృందం అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న ఒక కేసును రీ ఓపెన్ చేయించి దర్యాప్తు చేపడతారు. ఈ దర్యాప్తు బృందంలో ఈ కేసుకు సంబంధం ఉన్న మెరీనా కూడా ఉంటుంది.
రిలీజ్ డేట్ సెప్టెంబర్ 23
వోంకాస్ ది గోల్డెన్ టికెట్ (Wonka’s The Golden Ticket): ఇంగ్లిష్ రియాలి షో ఇది. దీనిలో పాల్గొనేవారు విల్లీ వోంకా చాకొలెట్ ఫ్యాక్టరీలోకి వెళ్లిన తరువా సంఘటనలను చూపిస్తుంది. ఇందులో 12 మంది జంటలు ఎదురయ్యే సవాళ్లను ఎలా ఛేదించి ఎవరు గెలుస్తారోనని వెల్లడిస్తుంది.
సెప్టెంబర్ 23న విడుదలవుతుంది.
మై స్యాడ్ డెడ్ (My Sad Dead): ఈ స్పానిష్ డ్రామా చనిపోయినవారితో మాట్లాడగల అతీంద్రియ శక్తులు ఉన్న ఎమా అనే మహిళ చుట్టూ అల్లుకున్నది. ఆమె మేనకోడలు రావడం, ముగ్గురు టీనేజర్లు హత్యకు గురవడం జీవించి ఉన్నవారు, మరణించినవారి మధ్య ఉన్న జీవితాన్ని ప్రస్తావిస్తుంది.
విడుదల తేదీ సెప్టెంబర్ 24
బ్లడ్ లెగసీ సీజన్ 2 (Blood Legacy Season): సౌతాఫ్రికా డ్రామా. దీనిలో ఎన్డ్లోవు కుటుంబం ఎదుర్కొనే మరో ప్రమాదకర అధ్యయాంతో మొదలవుతుంది. రాజకీయ అవినీతి, కుటుంబ కలహాలు వారసత్వాన్ని విచ్ఛిన్నం చేసేందు ప్రయత్నిస్తుండగా తన పేరును, వారసత్వాన్ని తిరిగి పొందడానికి ఖన్యీ చేసే పోరాటమే ఈ సిరీస్‌లో చూపించారు.
ఇది సెప్టెంబర్ 24న విడుదలవుతుంది.
ది ఫైనల్ ప్రాబ్లమ్ (The Final Problem): 1959ల నాటి స్పానిష్ మిస్టరీ కథ. షెర్లాక్ హోమ్స్ పాత్రలో నటించి రిటైర్ అయిన ఒక నటడు ఒక హోటల్లో జరిగిన హత్య కేసు దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఈ దర్యాప్తును ఉత్కంఠభరితంగా చూపించారు.
ఇది సెప్టెంబర్ 25న విడుదలవుతుంది.
ఉనాబాంబర్ (Unabomber): ఇంగ్లిష్ క్రైమ్ డ్రామా టెడ్ కస్జిన్స్కి చుట్టూ తిరుగుతుంది. అతడు హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చేసిన వివాదాస్పదమైన ప్రయోగాలపై ఎఫ్‌బీఐ చేపట్టే పరిశోధనను చూపించారు.
ఇది సెప్టెంబర్ 25న విడుదలవుతుంది.
శక్ (Shaque): ఇది హిందీ మిస్టరీ థ్రిల్లర్. తొమ్మిదేండ్ల నుంచి తప్పిపోయిన తన కూతురి కోసం వెతుకుతున్న మహిళ గురించి కథ నడుస్తుంది. కొత్త ఆధారాలు బయటపడటం, తన సన్నిహితులు, కూతురి అదృశ్యం చుట్టూ ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు సాగిన ప్రయాణం గురించి తీశారు.
సెప్టెంబర్ 24న రిలీజ్ కానున్నది.

Wonka’s Golden Ticket
ప్రైమ్ వీడియో (Prime Video)
ది లవ్ హైపోథీసిస్ (The Love Hypothesis): అత్యధికంగా అమ్ముడైన అలి హేజిల్‌వుడ్ నవల ఆధారంగా రొమాంటిక్ కామెడీ సినిమా. పీహెచ్డీ విద్యార్థిని ఆలివ్ ప్రొఫెసర్ ఆడమ్ కార్ల్సెన్ భయపెట్టి లొంగదీసుకుంటాడు. ఈ సంబంధంలో ఎదురయ్యే పరిస్థితులను వివరిస్తుంది ఈ చిత్రం.
విడుదల తేదీ సెప్టెంబర్ 23
డోంట్ బీ షై (Don’t Be Shy): ఇది హిందీ లవ్, బ్రేకప్ సినిమా. శ్యామిలి షై దాస్ అనే విద్యార్థిని ప్రేమలో బ్రేకప్ తరువాత ఎదురయ్యే అనుభవాల చుట్టూ అల్లుకుంటుంది.
ఇది సెప్టెంబర్ 25న విడుదలవుతుంది.

Don’t Be Shy
సోనీలివ్ (Sonyliv)
డాక్ (Doc): ఇది మెడికల్‌కు సంబంధించిన ఇంగ్లిష్ డ్రామా. ఒక సంఘటన వల్ల ఓ వైద్యుడి జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుంది. దీంతో గాడి తప్పిన తన వృత్తిని, సంబంధాలను ఎలా పునర్నిర్మించుకున్నారోననే అనే అంశంపై ఈ సినిమా తీశారు.
ఇది సెప్టెంబర్ 22న రిలీజ్ కానున్నది.
ఆపిల్ టీవీప్లస్ (Apple TV+)
బ్రదర్స్: ఇంగ్లిష్ కామెడీ సిరీస్. చిరకాల స్నేహితులైన మాథ్యూ మెక్కొనాఫే, వుడీ హారెన్సన్ పాత్రల చుట్టూ అల్లుకుంటుంది. వీరు సోదరులని తెలిసినప్పుడు వారి స్నేహం ఏ మలుపు తిరుగుతందని చూపించారు.
సెప్టెంబర్ 23న విడుదలవుంది.
జియోహాట్‌స్టార్ (JioHotstar)
హుంకార్ (Hunkaar): ఇది హిందీ కోర్ట్‌రూమ్ డ్రామా. దేవుడుగా భావించే ఒక వ్యక్తి తనపై లైంగిక దాడి చేశాడని 17 ఏండ్ల మీను రావత్ కేసుతో కథ నడుస్తుంది. పలుకుబడి, భయం, భక్తి, వ్యవస్థను సవాల్ చేసే స్థాయిలో కేసు ఉంటుంది.
సెప్టెంబర్ 25న విడుదలవుతుంది.

Hunkaar
జీ5 (ZEE5)
బకైతి సీజన్ 2 (Bakaiti Season): హిందీ ఫ్యామిలీ డ్రామా. కటారియా కుటుంబం తమ పూర్వికుల ఇంటిని రీడెవలప్ చేసుకునేక్రమంలో మరో సవాలును ఎదుర్కొంటుంది. కుటుంబమంతా ఒకేచోటుకు చేరడంతో ఏర్పడే ఉద్రిక్తతలు, సమస్యలను చూపుతుంది.
సెప్టెంబర్ 25న విడుదలవుతుంది.
అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ (Amazon MX Player)
రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2 (Rise & Fall Season): వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్‌గా వ్యవహరించే హిందీ రియాలిటీ షో ఇది. 15 మంది సెలబ్రిటీలను 42 రోజులు ఒక చోట ఉంచుతారు. ఈ రోజుల్లో వారి మధ్య ఉన్న వైరుధ్యాలు, అభిప్రాయాలను చూపిస్తుంది.
ఇది సెప్టెంబర్ 26న విడుదలవుతుంది.

Rise And Fall