భోపాల్: రైతుల నిరసన సందర్భంగా వారు తోస్తున్న బస్సు ముందు ఒక మహిళా పోలీస్ అధికారిణి ధైర్యంగా నిల్చున్నారు. ఆ లేడీ సింగం తెగువ చూసి రైతులు వెనుకడుగు వేశారు. బస్సును ముందుకు తోయడాన్ని ఆపివేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Lady Singham) నీట్ లీక్ వివాదంపై సీజేపీ ఆందోళనకు మద్దతుగా ముంబైలో నిరసన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీస్ వ్యాన్‌ను ఒక యువతి అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రైతుల నిరసన సందర్భంగా ఒక పోలీస్ అధికారిణి అదే మాదిరిగా వ్యవహరించారు. సీఎం నివాసం వైపు ర్యాలీగా వెళ్తున్న రైతులు అడ్డుగా ఉంచిన స్కూల్ బస్సును తోసేందుకు ప్రయత్నించారు. అయితే ఏసీపీ మోనికా శుక్లా ఆ బస్సు ముందు ధైర్యంగా నిల్చున్నారు. గమనించిన రైతులు ఆ బస్సును తోయడాన్ని ఆపివేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు.
మరోవైపు భోపాల్ లేడీ సింగంగా పిలిచే ఏసీపీ మోనికా శుక్లా సాహసోపేత చర్యకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఒక వార్తా ఛానల్‌తో ఆమె మాట్లాడారు. ఆ సమయంలో తాను భయపడలేదని, తన బాధ్యతను నిర్వర్తించినట్లు చెప్పారు. శాంతిభద్రతల నిర్వహణలో తనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో ఏ పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని ఆమె అన్నారు.
కాగా, నిరసనకారులు నేరస్తులు కాదని, తమ డిమాండ్లను వినిపిస్తున్న పౌరులేనని ఏసీపీ మోనికా శుక్లా తెలిపారు. అయితే సమస్యలు సృష్టించడానికి నిరసనకారుల మధ్యలో కొందరు అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల గురించి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని స్పష్టం చేశారు. అయితే శాంతియుతంగా, చట్ట పరిధిలో, సామాన్య ప్రజల జీవనానికి అంతరాయం కలగకుండా నిరసనలు జరుగాలని ఆమె అన్నారు.
Bhopal – In a display of presence of mind and courage, Additional Commissioner of Police Monica Shukla single-handedly stopped a bus carrying farmers who were attempting to move ahead near Barkatullah University in Bhopal. Farmers, some of whom were sitting on the roof of the… pic.twitter.com/p8CmVV7RCJ
— NextMinute News (@nextminutenews7) July 30, 2026