TET Results | ఇన్ సర్వీస్ టెట్ ఫలితాలు రిలీజ్.. 6,728 మంది టీచర్లు ఫెయిల్
TET Results | ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం విద్యాశాఖ నిర్వహించిన టెట్‌లో టీచర్లు భారీగా ఫెయిలయ్యారు. ఏండ్లుగా స ర్కార్ బడుల్లో ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్న కొందరు టీచర్లు టెట్ ను గట్టెక్కలేకపోయారు.
TET Results | హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం విద్యాశాఖ నిర్వహించిన టెట్‌లో టీచర్లు భారీగా ఫెయిలయ్యారు. ఏండ్లుగా స ర్కార్ బడుల్లో ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్న కొందరు టీచర్లు టెట్ ను గట్టెక్కలేకపోయారు. ఏకంగా 6,728 మంది ఫెయిలయ్యారు. పేపర్-1లో 1,544, పేపర్-2 (గణితం, సైన్స్)లో 2,411, పేపర్-2 (సోషల్)లో 2,773 మంది ఫెయిలవడం గమనార్హం.
సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఈ ఫలితాలను విడుదలచేశారు. ఈ నెల 8, 9వ తేదీల్లో ఇన్ సర్వీస్ టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 24,986 మంది దరఖాస్తు చేయ గా, 22,477 మంది పరీక్షలు రాశారు. వీరిలో 15,749 (70.07శాతం) మంది మాత్రమే క్వాలిఫై కావడం గమనార్హం. ఫలితాల విడుదలలో టెట్ కన్వీనర్ జీ రమేశ్, డిప్యూటీ డైరెక్టర్ రేవతి పాల్గొన్నారు.
నవంబర్‌లో మరో ఇన్ సర్వీస్ టెట్
ఇన్ సర్వీస్ టీచర్ల కోసం మరో టెట్ పరీక్షను నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ టెట్ ఇన్‌సర్వీస్ టీచర్స్-2 పేరిట ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. పరీక్షలను నవంబర్ 16 నుంచి 21 వరకు ఆన్లైన్లో నిర్వహిస్తామని చెప్పారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

