Police Allowances | బందోబస్తు ఫుల్.. అలవెన్స్ నిల్.. నిమజ్జనం ముగిసినా.. పూర్తిగా ఖాతాల్లో జమకాని అలవెన్స్లు!
Police Allowances | వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ పోలీసు శాఖ వేలాది సిబ్బందిని రంగంలోకి దించింది. గణేశ్ నవరాత్రుల ప్రారంభం నుంచి నిమజ్జన కార్యక్రమాలు ముగిసేవరకు పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వర్తించారు.
Police Allowances | హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ పోలీసు శాఖ వేలాది సిబ్బందిని రంగంలోకి దించింది. గణేశ్ నవరాత్రుల ప్రారంభం నుంచి నిమజ్జన కార్యక్రమాలు ముగిసేవరకు పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ మహానగర పరిధిలోనే సుమారు 25 వేల మందికిపైగా పోలీసులను బందోబస్తు కోసం వినియోగించినట్టు స్వయంగా డీజీపీ వెల్లడించారు.
జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను నగరానికి, నగరం చుట్టుపకల సున్నిత ప్రాంతాలకు తరలించారు. ఇంత భారీస్థాయిలో సిబ్బంది సేవలు వినియోగించుకున్న సర్కార్.. బందోబస్తు అలవెన్స్లు ఇప్పటికీ జమ చేయలేదన్న ఆవేదన వ్యక్తమవుతున్నది. వినాయక చవితి ప్రారంభమైనప్పటి నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీసులు నిరంతరాయంగా విధుల్లోనే ఉన్నారు. సాధారణ పోలీసింగ్తోపాటు గణేశ్ మండపాల వద్ద బందోబస్తు, ఊరేగింపులు, రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ, సున్నిత ప్రాంతాల్లో పికెట్లు, రాత్రి గస్తీ, నిమజ్జనమార్గాల్లో భద్రత వంటి బాధ్యతలను నిర్వహించారు.
సొంత ఖర్చులతోనే విధులు
ఈసారి బందోబస్తు అలవెన్స్ కొందరికి జమ కాలేదని పలువురు పోలీసు సిబ్బంది చెప్తున్నారు. బయట ప్రాంతాలనుంచి బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఎస్ఐలు తదితరులు తమ సొంత డబ్బులతోనే రోజువారీ అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మరోవైపు సరైన వసతులు సైతం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
కొన్నిప్రాంతాల్లో బందోబస్తు సిబ్బందికి సరైన విశ్రాంతి వసతులు లేక అందుబాటులో ఉన్న ప్రదేశాల్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని పలువురు సిబ్బంది చెప్తున్నారు. స్నానాలకు సరైన వసతులు లేకపోవడం, తాగునీరు, భోజనం వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా సకాలంలో అందక ఇబ్బందులు పడ్డామని అంటున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్కు, నగర శివారు ప్రాంతాల్లోని సున్నిత ప్రాంతాలకు బందోబస్తు కోసం వచ్చిన కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు వివిధ ర్యాంకుల సిబ్బందిలో కొందరికి ఉత్సవాలు ముగిసినా ఇంకా అలవెన్స్లు అందలేదని చెప్తున్నారు.
బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లి అక్కడ మళ్లీ రిపోర్టు చేశారు. చాలామంది పోలీసులు తమ కుటుంబ అవసరాలకు కేటాయించిన డబ్బునే బందోబస్తు సమయంలో ఖర్చు చేసినట్టు తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో బందోబస్తు విధులకు వెళ్లిన హోంగార్డుల పరిస్థితి కూడా దారుణంగానే ఉన్నది. వారిలో చాలామందికి బందోబస్తు అలవెన్స్ ఇంకా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

