daughter-in-law’s marriage | కుమారుడు మరణించిన కొన్ని రోజులకే.. కొడలికి పెళ్లి జరిపించిన అత్త
daughter-in-law's marriage | కుమారుడు మరణించడంతో కోడలి భవిష్యత్తు గురించి అత్త ఆలోచించింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మరో పెళ్లి చేయాలని నిర్ణయించింది. చివరకు ఒక వ్యక్తితో కోడలికి వివాహం జరిపించించింది. ఆమెకు కొత్త జీవితాన్ని అందించింది.
లక్నో: కుమారుడు మరణించడంతో కోడలి భవిష్యత్తు గురించి అత్త ఆలోచించింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మరో పెళ్లి చేయాలని నిర్ణయించింది. చివరకు ఒక వ్యక్తితో కోడలికి వివాహం జరిపించించింది. ఆమెకు కొత్త జీవితాన్ని అందించింది. (daughter-in-law’s marriage) ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన మీనాక్షికి పదేళ్ల కిందట ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన రోహిత్‌తో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఏడేళ్ల రితూ, ఏడాదిన్నర వయసున్న అవిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు సంతోషంగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు.
కాగా, విధి వక్రీకరించడంతో వారి జీవితాలు మారిపోయాయి. మేస్త్రీగా పనిచేస్తున్న రోహిత్ తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతూ ఆగస్ట్ 14న మరణించాడు. అయితే తండ్రి మరణాన్ని తట్టుకోలేని రోహిత్ ఆ మరునాడైన ఆగస్ట్ 15న చనిపోయాడు. దీంతో ఇద్దరు చిన్న కుమార్తెలతో మీనాక్షి ఒంటరిగా మిగిలింది.
మరోవైపు ఈ విషాద సమయంలో కోడలు మీనాక్షి భవిష్యత్తు గురించి అత్త సునీత ఆలోచించింది. ఒక స్థిరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఆమెకు కల్పించాలని నిర్ణయించింది. మరో పెళ్లి అంశంపై మీనాక్షితో పాటు ఆమె కుటుంబ సభ్యులతో చర్చించింది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23న రాజస్థాన్‌లోని నారాయణపూర్‌కు చెందిన చాట్ విక్రేత యోగేష్‌తో కోడలు మీనాక్షికి అత్త సునీత పెళ్లి జరిపించింది. స్థానిక ఆర్య సమాజ్ ఆలయంలో ఈ వివాహ వేడుక జరిగింది. మీనాక్షి మరిది అయిన మోహిత్, ఆమెకు సోదరుడి పాత్ర పోషించాడు. ‘కన్యాదానం’ ఘట్టాన్ని నిర్వహించాడు.
అలాగే అత్త సునీత కూడా సాంప్రదాయ బాధ్యతలను నిర్వర్తించింది. కోడలకు కొత్త జీవితం అందించడం పట్ల ఆమె చాలా ఆనందం వ్యక్తం చేసింది. మీనాక్షి కొత్త ఇంటికి మారినప్పటికీ ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తామని, కోడలితో ఉన్న అనుబంధాన్ని అలాగే ఉంచుతామని అత్త సునీత, మరిది మోహిత్ మాట ఇచ్చారు. కొత్త జీవితం ఆరంభం పట్ల మీనాక్షి కూడా సంతోషంగా కనిపించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
सास ने बहू को बेटी माना, कराया पुनर्विवाह… देवर ने किया कन्यादान
मुजफ्फरनगर के खतौली में बेटे की मौत के करीब एक महीने बाद सास ने अपनी बहू का पुनर्विवाह कराया. आर्य समाज मंदिर में हुई शादी में देवर ने भाई बनकर कन्यादान किया. बहू ने कहा कि उसने अपनी मर्जी से शादी का फैसला लिया है… pic.twitter.com/CfoMfX9ot9— AajTak (@aajtak) September 24, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

