మియాపూర్ భూములపై కాంగ్రెస్ కన్ను
గత ప్రభుత్వం ఎంతో కష్టపడి కాపాడిన 550 ఎకరాల భూమిని తెగనమ్మేందుకు కాంగ్రెస్ సరార్ అడుగులు వేస్తోంది. 100 ఎకరాలకుపైగా ఆక్రమణలు పోను మిగిలిన 386 ఎకరాల్లో 220 ప్లాట్లు చేసి విక్రయించేందుకు వేగం పెంచింది.
- రూ.40వేల కోట్ల ఆదాయమే లక్ష్యం
- హారతి కర్పూరంలా కరగనున్న ప్రభుత్వ ఆస్తులు
- రెండు దశాబ్దాల న్యాయ పోరాటం చేసినబీఆర్ఎస్ సర్కార్
- ఖజానా నింపుకొనేందుకు రేవంత్ ప్రభుత్వం ఆరాటం
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ):గత ప్రభుత్వం ఎంతో కష్టపడి కాపాడిన 550 ఎకరాల భూమిని తెగనమ్మేందుకు కాంగ్రెస్ సరార్ అడుగులు వేస్తోంది. 100 ఎకరాలకుపైగా ఆక్రమణలు పోను మిగిలిన 386 ఎకరాల్లో 220 ప్లాట్లు చేసి విక్రయించేందుకు వేగం పెంచింది. మూడేండ్ల పాలనలో భూముల అమ్మకమే ప్రధాన ఆదాయ వనరుగా మారిందనే విమర్శల నేపథ్యంలో..ఉన్న భూములను హారతి కర్పూరంలా కరిగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. రూ. 40వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వ భూములను అంగడి సరుకుగా మార్చింది.
హైదరాబాద్ నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్‌కు కూతవేటు దూరంలో ఉన్న మియాపూర్ ప్రభుత్వ భూములపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడింది. గత ప్రభుత్వం రెండు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ న్యాయపోరాటం చేసి, ప్రైవేట్ వ్యక్తుల చెర నుంచి కాపాడిన వందలాది ఎకరాల విలువైన భూమిని ఇప్పుడు వేలం పేరుతో తెగనమ్మేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ భూములను భవిష్యత్ తరాల కోసం, ప్రజా అవసరాల కోసం పరిరక్షించాలన్న గత ప్రభుత్వ ఆశయాన్ని పూర్తిగా విస్మరించిన ప్రస్తుత పాలకులు..మియాపూర్ భూములను కేవలం రూ. 40వేల కోట్ల ఆదాయంగా మలుచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో విలువైన ప్రభుత్వ భూములను అమ్మడం, ఆ సొమ్మును సంక్షేమ పథకాలకు మళ్లించడం, అవసరమైతే ముఖ్య నేతలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టి సొమ్ము చేసుకోవడం చేస్తున్నది.
విలువైన భూములే కాంగ్రెస్‌కు వరం…
కాంగ్రెస్ ఖజానాకు వరం మియాపూర్‌లోని సుమారు 550 ఎకరాల భూమి కోసం గత 23ఏళ్లుగా సుప్రీంకోర్టులో సాగిన న్యాయపోరాటంలో సుమారు రెండు నెలల కిందట ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ భూమి ముమ్మాటికీ ప్రభుత్వానిదేనని అత్యున్నత న్యాయస్థానం
స్పష్టం చేసింది. తీర్పు వచ్చిన వెంటనే ఆ భూమిని ప్రజాప్రయోజనాలకు ఉపయోగించే ప్రణాళికలు వేయాల్సింది పోయి, తక్షణమే దానిని విక్రయించే పనిలో నిమగ్నమైంది. రెవెన్యూ శాఖ నిర్వహించిన తాజా సర్వేలో మొత్తం 550 ఎకరాల్లో ఆక్రమణలు పోను 386 ఎకరాల భూమి వేలానికి అనుకూలంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. మిగిలిన భూమిలో దాదాపు 110 ఎకరాల్లో ఇప్పటికే నివాస కాలనీలు వెలిశాయని, ప్రస్తుతానికి వారిని ఖాళీ చేయించకుండా కొంత రుసుము వసూలు చేసి క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి క్యాబినెట్ ఆమోదంతో కూడిన ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, తద్వారా అటు క్రమబద్ధీకరణ ఫీజుల రూపంలో, ఇటు 386 ఎకరాల వేలం రూపంలో భారీగా నిధులు రాబట్టాలని ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భారీ లేఅవుట్ ..
సీఎం రేవంత్ రెడ్డి గత నెలలోనే ఈ భూముల వేలానికి పచ్చజెండా ఊపడంతో, హెచ్ఎండీఏ అధికారులు అత్యంత వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే 386 ఎకరాలకు సంబంధించి ముసాయిదా లేఅవుట్ కోసం కసరత్తు మొదలుపెట్టారు. మొత్తం భూమిని ప్లాట్లుగా విభజించి, విస్తీర్ణం పావు ఎకరం మొదలుకొని ఏకంగా 3.6 ఎకరాల వరకు ఉండేలా రూపొందించారు. వాణిజ్య,నివాస అవసరాలకు అనుగుణంగా లే అవుట్ రూపకల్పన చేస్తున్నారు. మొత్తం 386 ఎకరాల్లో 156 ఎకరాలను రహదారులు, బహిరంగ ప్రదేశాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, వాణిజ్య కార్యకలాపాలు, జలవనరుల కోసం కేటాయించినట్లుగా తెలిసింది. ముఖ్యమంత్రి తుది ఆమోదం రాగానే, లేఅవుట్ అభివృద్ధి పనులు ప్రారంభించి, మూడు నెలల్లోగా వేలం ప్రక్రియను పట్టాలెకించేందుకు హెచ్ఎండీఏ అధికారులు సిద్ధమవుతున్నారు.
మియాపూర్ భూములకు ఒకేసారి వేలం..
న్యాయపోరాటం తర్వాత కోకాపేట్ భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత… వాటిని అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించి, ఆ ప్రాంతంలో మార్కెట్ విలువను పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం, పెరుగుతున్న భూముల విలువకు అనుగుణంగా వేలం పాట నిర్వహించింది. కానీ మియాపూర్ భూములను ఒకేసారి కట్టబెట్టి, భూములతో సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. ఇకడ దశలవారీగా వేలం నిర్వహిస్తే ప్రభుత్వ అవసరాలు తీరే చాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా మారెట్ డిమాండ్ ను అంచనా వేస్తూ, చుట్టుపకల అభివృద్ధి జరిగే కొద్దీ భూముల ధరలు పెరుగుతాయనే అంచనాతో గరిష్ఠ ధర రాబట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఐటీ కారిడార్ కు సమీపంలో ఉండటంతో ఈ భూములకు రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి భారీ డిమాండ్ ఉంటుందని, దీని ద్వారా ఏకంగా రూ. 40వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం లెకలు కడుతోంది. ఈ వేలం ద్వారా వచ్చే నిధులను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వినియోగిస్తామని మున్సిపల్ పరిపాలన శాఖ వర్గాలు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భూముల అమ్మకమే పాలనా విధానమా…
ప్రభుత్వ భూములను పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ప్రభుత్వ ఆస్తులను అందించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం న్యాయస్థానాల్లో పోరాడి ఈ భూములను కాపాడితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కేవలం సొమ్ము చేసుకునే సాధనాలుగా మార్చుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన మూడేండ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి పనుల కంటే భూముల విక్రయాలపైనే ప్రభుత్వం ఎకువగా ఆధారపడుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆదాయ వనరులను పెంచుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా, చేతిలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను తెగనమ్మి, ఆ నిధులను సంక్షేమ పథకాల అమలుకు, రోజువారీ ఖర్చులకు మళ్లించడం వల్ల రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వేలం ప్రక్రియ వెనుక అధికార పార్టీ ముఖ్య నేతలు, వారికి సన్నిహితంగా ఉండే రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశం దాగి ఉందన్న ఆరోపణలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాల పోరాటంతో దకిన మియాపూర్ వంటి అత్యంత విలువైన భూములు కూడా ఇప్పుడు వేలం పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి, ప్రభుత్వ ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోయే పరిస్థితి నెలకొనడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

