రేవంత్ అష్టదిగ్బంధం
మళ్లీ మొదలైన అసమ్మతి సెగలు.. 8 మంది ఎమ్మెల్యేల కూటమి తెరపైకి.. ముఖ్యమంత్రి శిబిరానికి మరో శిరోవేదన.. రాజగోపాల్‌రెడ్డిని టచ్ చేస్తే తిరుగుబావుటా ఎగరేసే యోచన
- వ్యతిరేక కూటమిలో నలుగురు ఎమ్మెల్యేలు పాలమూరు వాళ్లే
- గతంలో రహస్య భేటీతో సర్కార్‌కు చెమటలు పట్టించింది వీళ్లే
- చాన్స్ వస్తే నాయకత్వం వహించాలని సీనియర్ నేతకు వినతి
- ఖమ్మం, నల్లగొండ, పాలమూరు కూడికలపై ఇంటెలిజెన్స్ నిఘా
- కొండాపై కత్తిదూసిన సీఎం శిబిరం.. రాజగోపాల్‌పై మౌనం
(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) : కొండా సురేఖ విషయంలో వేగంగా కత్తిదూసిన ముఖ్యమంత్రి వర్గం, అంతకంటే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నది? సుస్మిత మాటలను సురేఖకు ఆపాదించి ఆమెను వెంటనే బర్తరఫ్ చేయాలన్న వేముల వీరేశం.. ఎమ్మెల్యేల బృందం ఇప్పుడెందుకు మౌనం దాల్చింది? ఈ మౌ నం వెనుక బలమైన భయం దాగి ఉన్నదా? రాజగోపాల్‌ను టచ్ చేయకుండా ఆ 8 మంది ఎమ్మెల్యేల కోటరీ కోటగోడలా అడ్డు ఉన్న దా? ఏమాత్రం తేడా వచ్చినా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉన్నదని సీఎం శిబిరం జంకుతున్నదా? అంటే రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు ‘అవును’ అనే అంటున్నాయి.
కాంగ్రెస్‌లో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉన్నది. క్యాబినెట్ సహచరురాలైన కొండా సురేఖపై వేగంగా వేటు వేసిన తర్వాత తన ఆధిపత్యానికి తిరుగులేదని, తన నాయకత్వాన్ని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేరనే భావనతో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి శిబిరానికి ఝలక్ ఇచ్చేందుకు ఎమ్మెల్యేల కోటరీ సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. రోజురోజుకు పెరిగిపోతున్న ఏకఛత్రాధిపత్య ధోరణికి దీటుగా చెక్ పెట్టేందుకు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల సారథ్యంలో యువ ఎమ్మెల్యేలు కొందరు జట్టు కట్టినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన అవినీతి ఆరోపణలను అప్పటి మంత్రి సురేఖకు ఆపాదించి, వేముల వీరేశం వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్‌మీట్ పెట్టి మరీ సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చే శారు. కూతురు మాట్లాడిన మాటలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు కనీసం వివరణ ఇచ్చే అవకాశమైనా ఇవ్వండని సురేఖ మొరపెట్టుకున్నా.. వినకుండా ఢిల్లీలోని ఒక వర్గం పెద్దల సౌజన్యంతో బీసీ మహిళా మంత్రిని బర్తరఫ్ చేశారు.
.. మరి ఇప్పుడేమైంది?
కొండా సురేఖ విషయంలో అంత వేగంగా కదిలిన సీఎం అనుకూల ఎమ్మెల్యేల బృందం, రాజగోపాల్‌రెడ్డి విషయంలో ఎందుకు మౌ నంగా ఉన్నదనే చర్చ జరుగుతున్నది. సుస్మిత విమర్శల కంటే పది రెట్లు ఎకువ ఘాటుగా ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ రాజగోపాల్‌రెడ్డి విమర్శిస్తున్నారు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర, మాత్రమేనా? అని ప్రశ్నించిన ఆయన, కొడంగల్‌కు రూ.20 వేల కోట్లు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి తన నియోజకవర్గం మునుగోడుకు కనీసం రూ.500 కోట్లు కూడా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ‘ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు, ఉన్న రెండేండ్లయినా మంచి పాలన అం దించు, లేదంటే కురుక్షేత్రం తప్పదు’ అని బహిరంగంగానే సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి రూ.5 లక్ష ల కోట్లు దోచుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పు తెచ్చిన 4 లక్షల కోట్ల రూపాయల్లో ఎక్కువ డబ్బు కమీషన్ల రూపంలో వా ళ్ల జేబుల్లోకే వెళ్లాయని ఆరోపించారు.
వీరేశం ఎమ్మెల్యేల బృందం మౌనం
రాజగోపాల్‌రెడ్డి చేసిన విమర్శలకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట బహిరంగ సభ వేదికగా పరోక్ష కౌంటర్ ఇస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంచిని మైకులో చెప్పి, చెడు ఏదైనా ఉంటే చెవిలో చెప్పాలని హితవు పలుకుతూ నే, పార్టీ గీత దాటి మాట్లాడే వారిని పార్టీ కార్యకర్తలే ఎర్రగడ్డ దవాఖానకు తీసుకెళ్తారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ మాటలు రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డిని ఉద్దేశించే అ న్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. పరోక్ష హెచ్చరికలకు ఏమాత్రం తగ్గని రాజగోపాల్‌రెడ్డి, సోషల్ మీడియా వేదికగా అహంకారం వీడి పాలనపై దృష్టి పెట్టాలని మరోసారి కౌం టర్ ఇవ్వడం ఆయన ధిక్కార తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసినా ఇప్పటివరకు వీరేశం నేతృత్వంలోని ఆ 17మంది ఎమ్మెల్యేల బృందం ఒక మాట కూడా మాట్లాడకపోవడం వెనుక బలమైన కారణం ఉన్నదని చెప్తున్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా నివేదికలు పంపామని చె ప్తూ కాలయాపన చేస్తున్నది తప్ప, కనీసం షోకాజ్ నోటీసు ఇచ్చే సాహసం కూడా చేయకపోవటం వెనుక ఆ 8 మంది ఎమ్మెల్యేల ధి క్కార ధోరణే కారణమనే చర్చ జరుగుతున్నది.
రేవంత్‌కు ఆ ఎమ్మెల్యేల రివర్స్ గేర్
నిరుడు ఫిబ్రవరిలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆధ్వర్యంలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశ మై రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ధిక్కార సంకేతా లు పంపి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక బలమైన అసమ్మతి జట్టుగా తయారయ్యారని, వీరికి రాజగోపాల్‌రెడ్డి తెరవెనుక నాయకత్వం వహిస్తున్నారని పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ 8 మందిలో ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం.
వైకుంఠపాళి ఆటలో రేవంత్ ప్రభుత్వం
రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటే ఈ వ్యతిరేక ఎమ్మెల్యేల కోటరీ ఒకసారిగా తిరుగుబాటుకు దిగే ప్రమాదం ఉన్నదని నిఘావర్గాలు హెచ్చరించినట్టు తెలిసింది. ఉద్దేశ్యపూర్వకంగానే ఒకవైపు రాజగోపాల్‌రెడ్డి, మరోవైపు అనిరుధ్‌రెడ్డి అసమ్మతి గళం పెంచుతున్నారని వారు సీఎం శిబిరాన్ని హెచ్చరించినట్టు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి నేరుగా సీఎంను టార్గెట్ చేస్తుండటం, అనిరుధ్‌రెడ్డి భూకబ్జాలపై, ఇటు మంత్రులకు మాత్రమే నిధులు ఇస్తున్నారని ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం వ్యూహాత్మకమే అని ఇంటెలిజెన్స్ విభాగం విశ్లేషించి చెప్పినట్టు తెలిసింది.
ఒకవేళ ఈ అసమ్మతి ఎమ్మెల్యేలకు తోడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరుల వర్గం, ఖమ్మం జిల్లాలో బలమైన పట్టున్న రెవెన్యూ మంత్రి వర్గం ఏకమైతే ప్రభుత్వ మనుగడకే ముప్పు వాటిల్లవచ్చనే లెకలు వేసి చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే అధిష్ఠానం ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు చూడాల్సి వస్తుందని, ఆ రేసులో సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరు తెరపైకి వస్తుందనే భయం కూడా సీఎం శిబిరంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్యేలపై పూర్తి పట్టున్న కీలక మంత్రి ఒకరు రాజగోపాల్‌రెడ్డితో సయోధ్య కుదుర్చుకునే సంకేతాలు కూడా పంపినట్టు ప్రచారం జరుగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

