యూపీలో కాంగ్రెస్‌కు ఎస్పీ ఝలక్
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతుండగానే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
- 181 అసెంబ్లీ సీట్లు కోరితే 26 మాత్రమే ఇస్తామని స్పష్టీకరణ
- గెలుపు అవకాశాలే సీట్ల కేటాయింపునకు ప్రాతిపదికని వెల్లడి
- అభ్యర్థుల పేర్ల్లూ ఇవ్వాలని షరతు
- చర్చలు కొనసాగుతుండగానే ఐదు సీట్లకు అభ్యర్థుల ప్రకటన
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతుండగానే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 403 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్ తొలుత 181 స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదించగా, ఎస్పీ మాత్రం తొలి విడతలో 26 స్థానాలనే ఆఫర్ చేసింది. నవంబర్ 23న జరిగిన చర్చల్లో కాంగ్రెస్‌ను ఆ సంఖ్యను 131 తగ్గించింది.
24న జరిగిన రెండో విడత చర్చల్లో మరోసారి తగ్గించి 110 స్థానాల జాబితాను ఎస్పీకి అందించినట్టు ఎన్డీటీవీ కథనం వెల్లడించింది. అయితే ఎస్పీ మాత్రం 26 స్థానాలతో కూడిన జాబితాను కాంగ్రెస్ ముందు ఉంచింది. ఈ సంఖ్య మరింత పెంచే అవకాశం ఉన్నప్పటికీ, తుది ఆఫర్ 50 స్థానాలు దాటకపోవచ్చని ఎస్పీ వర్గాలు తెలిపినట్టు ది ప్రింట్ పేర్కొన్నది. కనీసం 100 స్థానాలపైనా దక్కాలని కాంగ్రెస్ పట్టుబడుతుండటంతో ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.
26 స్థానాల ఎంపిక వెనుక ఎస్పీ లెక్కలు
కాంగ్రెస్‌కు ప్రతిపాదించిన 26 స్థానాలను ఎస్పీ మూడు వర్గాలుగా విభజించినట్టు సమాచారం. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాలు, రెండో స్థానంలో నిలిచిన నాలుగు స్థానాలు ఇందులో ఉన్నాయి. కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాల ఆధారంగానే ఈ ప్రతిపాదన రూపొందించినట్టు ఎస్పీ నేతలు వివరిస్తున్నారు. 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ 399 స్థానాల్లో పోటీ చేసి కేవలం రెండింటిలోనే గెలిచింది. మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తులో పోటీచేసిన కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి ఆరు గెలుచుకుంది. ఈ ఫలితాలనే ప్రాతిపదికగా తీసుకుని ఎక్కువ స్థానాలు కోరుతున్నామని కాంగ్రెస్ చెబుతున్నది.
అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపైనా వివాదం
అమేథీ, రాయ్‌బరేలీ జిల్లాల్లోని పది అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిదింటిని కాంగ్రెస్ కోరుతున్నట్టు సమాచారం. 2022 ఎన్నికల్లో ఈ పది స్థానాల్లో ఆరింటిని ఎస్పీ, నాలుగింటిని బీజేపీ గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు.
అభ్యర్థుల పేర్లూ ఇవ్వాలన్న ఎస్పీ
సీట్ల కేటాయింపుతోపాటు కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న అభ్యర్థుల పేర్లు, వారి కుల సమీకరణాలు, గెలుపు అవకాశాల వివరాలు కూడా అందించాలని ఎస్పీ కోరినట్టు సమాచారం. అయితే ముందుగానే అభ్యర్థుల పేర్లు వెల్లడించేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపడం లేదని కథనాలు పేర్కొన్నాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాత్రం గెలుపు అవకాశాలే సీట్ల పంపకానికి ప్రాతిపదిక కావాలని చెబుతున్నారు. కూటమి ఏర్పాటు చేసుకునేది ఎన్నికల్లో గెలవడానికేనని, అందుకు ఇరు పార్టీలు పరస్పరం సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. కాగా ఎస్పీ ప్రకటించిన తొలి ఐదుగురు అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ ఆశిస్తున్న సహారన్పూర్, బెహట్ స్థానాలు ఉండటంతో ఇరు పార్టీల మధ్య అసంతృప్తి వ్యక్తమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

