రియల్టీ సంస్థలపై ‘రెరా’ కొరడా
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నిర్మాణ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) కొరడా ఝుళిపించింది. రెరా నమోదు లేకుండానే ప్రీ-లాంచ్ ప్రకటనలు ఇవ్వడం, భూమికి సంబంధించిన కోర్టు కేసుల వివరాలను దాచిపెట్టడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన మూడు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలపై సుమోటోగా విచారణ చేపట్టి మొత్తం రూ.41, 10,390 జరిమానా విధించింది.
- రూ.41.10 లక్షల జరిమానా
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నిర్మాణ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) కొరడా ఝుళిపించింది. రెరా నమోదు లేకుండానే ప్రీ-లాంచ్ ప్రకటనలు ఇవ్వడం, భూమికి సంబంధించిన కోర్టు కేసుల వివరాలను దాచిపెట్టడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన మూడు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలపై సుమోటోగా విచారణ చేపట్టి మొత్తం రూ.41, 10,390 జరిమానా విధించింది. మరొక సంస్థకు పెండింగ్ కేసుల వివరాలు సమర్పించాలని గడువు విధించింది.
‘ఆరో రియాల్టీ’కి రూ.25 లక్షల ఫైన్
కొండాపూర్‌లోని ‘ఆరో సఫైర్’ నివాస ప్రాజెక్టుకు రెరా అనుమతి రాకముందే డిజిటల్ మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించిన ఆరో రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ కు రెరా రూ.25 లక్షల జరిమానా విధించింది. 8 ఎకరాల్లో 4 టవర్లు, 1,300కు పైగా ఫ్లాట్లతో కూడిన ఈ ప్రాజెక్టు ధరలు రూ.2 కోట్ల నుంచి ప్రా రంభమవుతాయంటూ ప్రకటనలు గుప్పించినట్లు అథారిటీ గుర్తించింది. తమ లోగోను ఇతరులు వాడుకున్నారన్న సంస్థ వాదనను తోసిపుచ్చుతూ, 30 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని, లేకుంటే సెక్షన్ 63 కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
జనప్రియ టౌన్ షిప్స్‌కు రూ.10 లక్షలు..
చందానగర్ లోని ‘బహితి’ ,సైనిక్ పురిలోని ‘అల్టెయిర్’ ప్రాజెక్టులకు రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రకటనలు ఇచ్చిన జనప్రియ టౌన్ షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.10 లక్షల జరిమానా పడింది. అలాగే ఇప్పటికే నమోదైన నైల్ వ్యాలీ, లేక్ ఫ్రంట్, సితార ప్రాజెక్టుల ప్రకటనల్లో రెరా నంబర్లు స్పష్టంగా లేకపోవడాన్ని అథారిటీ తప్పుబట్టింది. తక్షణమే ప్రచారం, బుకింగ్‌లు నిలిపివేసి, అనుమతులు వచ్చిన 30 రోజుల్లోగా రెరా రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని ఆదేశించింది.
జీకేహెచ్ ప్రాపర్టీస్ కు రూ.6.10 లక్షల జరిమానా..
కాప్రాలోని ‘జీకేస్ ప్రవిష్ అబోడ్’ ప్రాజెక్టు భూమిపై ఉన్న సివిల్ కేసుల వివరాలను నమోదు సమయంలో దాచిపెట్టినందుకు జీకేహెచ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు రూ.6,10,390 జరిమానా విధించింది. ఇది రెరా చట్టంలోని సెక్షన్ 4 ఉల్లంఘన అని పేరొంది. ఆ తర్వాత కేసులు పరిషారమైనా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చినా గతంలో చేసిన ఉల్లంఘనకు మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పుప్పాలగూడలోని ‘వెస్టర్న్ విండ్సర్ పార్’ ప్రాజెక్టు భూమికి సంబంధించి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, ఉత్తర్వుల పూర్తి వివరాలను 30 రోజుల్లోగా సమర్పించాలని వెస్టర్న్ కన్ స్ట్రక్షన్స్ విండ్సర్ పార్ ఎల్ఎల్పీని ఆదేశించింది. హెచ్ఎండీఏ నివేదిక, ఇతర పత్రాల పరిశీలన అనంతరం జరిమానా లేకుండానే సుమోటో విచారణను ముగించినప్పటికీ.. భవిష్యత్తులో తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

