ప్రజాస్వామ్యానికి బీజేపీ పాతర!
నరేంద్ర మోదీ సర్కార్ పాలనకు పన్నెండున్నరేండ్లు నిండుతున్నాయి. దివంగత కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ తన 8 ఏండ్ల పాలన తర్వాత 1974లో అనేక ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నట్టే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రజా నిరసనను చవిచూస్తున్నది. ప్రజల ఆగ్రహావేశాలకు విరుగుడుగా నాడు ఇందిర దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి మరింత వ్యతిరేకత మూటగట్టుకుని రెండేండ్లకే అధికారం కోల్పోయారు.
నరేంద్ర మోదీ సర్కార్ పాలనకు పన్నెండున్నరేండ్లు నిండుతున్నాయి. దివంగత కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ తన 8 ఏండ్ల పాలన తర్వాత 1974లో అనేక ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నట్టే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రజా నిరసనను చవిచూస్తున్నది. ప్రజల ఆగ్రహావేశాలకు విరుగుడుగా నాడు ఇందిర దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి మరింత వ్యతిరేకత మూటగట్టుకుని రెండేండ్లకే అధికారం కోల్పోయారు. అధికారం సుస్థిరం చేసుకోవడానికి కాంగ్రెస్ ఫక్కీలోనే బీజేపీ కూడా ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. కేంద్రంలో, మెజార్టీ రాష్ర్టాల్లో తమకు చిక్కిన అధికారాన్ని అడ్డగోలుగా వాడుకుంటూ శాశ్వత పాలకపక్షంగా కొనసాగడానికి నిస్సిగ్గుగా అన్ని దారుల్లో పాలకపక్ష నేతలు నడుస్తున్నారు.
మత రాజకీయాలకు, తమ పార్టీకి కాస్త అనుకూల వాతావరణం ఉన్నట్టు కనిపించే ఉత్తరాది..ముఖ్యంగా హిందీ రాష్ర్టాల్లో పెరిగిన జనాభా ఆధారంగా చట్టసభల్లో సీట్లు పెంచడానికి పార్లమెంటును మోదీ సర్కార్ ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు కోటా పేరుతో దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు తెరతీసి ఈ ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. అన్నిటికీ మించి ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థకు పాతరేసే అనేక దుర్మార్గాలకు తెరలేపుతున్నది. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడు విజయాల తర్వాత బీజేపీ వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీ) వ్యూహం ఏడాదిన్నర క్రితం అమల్లోకి వచ్చింది. 2025 జూన్ 24న ఈసీ ఎంతో ఆర్భాటంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభించింది. నెహ్రూ, ఇందిర తదితర నేతల నాయకత్వంలోని కాంగ్రెస్ మాదిరిగా అనేక దశాబ్దాలపాటు కేంద్రంలో పాగా వేయడానికి ‘సర్’ బీజేపీకి అక్కరకొచ్చింది.
2002లో అమలు చేసిన ఈ ప్రక్రియను ఈసారి అడ్డగోలుగా వాడుకోడువాలని మోదీషా ద్వయం సహా పాలకపక్షం అగ్రనేతలు నిర్ణయించుకున్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాలకు ఓటు వేసే అవకాశం లేని ప్రజల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి పెద్ద సంఖ్యలో నిర్దాక్షిణ్యంగా తొలగించడమే మార్గంగా వారికి కనిపించింది. రాజ్యాంగబద్ధ స్వయంప్రతిపత్తి గల సంస్థ ఎన్నికల సంఘం కేంద్ర సర్కార్ చేతిలో మంచి పనిముట్టుగా మారింది. బీజేపీకి అనుకూలంగా చేపట్టిన ‘సర్’ వల్ల అత్యధిక రాష్ర్టాల్లోని పేదలు, బడుగువర్గాలు, ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓట్లు కోల్పోయారు. తమకు అనుకూలం కాని ఓటర్లను జాబితాల నుంచి తొలగించడంతో బీజేపీ ఎప్పుడూ గెలిచే అవకాశం లేని హర్యానా, పశ్చిమబెంగాల్, బిహార్ వంటి రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చింది.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా ‘సర్’ సంబంధిత నిర్ణయాలు తీసుకుని బీజేపీకి అనుకూలంగా దాన్ని అమలు చేశారనే వాస్తవం ఆరు నెలల క్రితం వెల్లడయ్యాక మోదీ సర్కార్, బీజేపీ వరుసగా తప్పటడుగులు వేస్తున్నాయి. ‘సర్’ ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై జవాబు చెప్పుకోవాల్సిన ఈసీ లేదా సీఈసీ ఆ పని సక్రమంగా చేయడం లేదు. ఈ నేపథ్యంలో ‘సర్’ అక్రమాలతో తమకు చెడ్డ పేరు వస్తున్నదనే కారణంతో బీజేపీయే స్వయంగా రంగంలోకి దిగింది.
‘సర్’పై అబద్ధాలు, అర్ధసత్యాలతో ప్రజల్ని మభ్యపెట్టాలనే లక్ష్యంతో ‘యాత్ర’ల పేరిట రూపొందించిన కమలం నేతల కుట్ర విజయవంతం కావడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజల్లో కోట్లాది మంది ఆ తర్వాత జరిగిన కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ‘సర్’ ఫలితంగా ఓటు వేయలేకపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిమార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లో రెండు కోట్ల మంది హిందూ ఓటర్ల పేర్లు ‘సర్’లో తొలగించారంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించి అభాసుపాలయ్యారు. అన్ని రాష్ర్టాల్లో బీజేపీకి అనుకూలం కాని ఓటర్లను ‘సర్’లో తొలగించడం ద్వారా ఈసీ తాను పాలకపక్షానికి అక్రమ పనిముట్టుగా నిరూపించుకున్నది. అలాంటిది యూపీలో ఆ పని ఎందుకు చేస్తున్నదో ఆ పార్టీ నేతలే చెప్పాలి.
అయినా, హిందువులంతా బీజేపీ ఓటర్లే అయినట్టు చెప్పడం యోగి తెలివితేటలకు నిదర్శనం. దేశాన్ని దశాబ్దాలపాటు పరిపాలించిన కాంగ్రెస్ మాదిరిగానే మోదీ సర్కార్ కూడా కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా, తమ సొంత రాష్ట్రం గుజరాత్‌కు చెందిన ఒకట్రెండు పారిశ్రామిక సముదాయాలకు మేలు చేసే విధానాలను బీజేపీ సర్కార్ అమలు చేస్తున్నది. అంతటితో ఆగకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఒకరిద్దరు బడా పారిశ్రామికవేత్తల కంపెనీలకు మేలు చేసే వాతావరణం సృష్టిస్తున్నది. అదానీ కంపెనీలకు అక్రమ లబ్ధి చేకూరేలా కేంద్రం తన అధికారం, పలుకుబడిని విస్తృతంగా వినియోగిస్తున్నది.
యూపీ, బిహార్ సహా అనేక ఉత్తరాది రాష్ర్టాల్లో సాగు సన్నగిల్లడంతో ఈ ప్రాంతాల నుంచి దక్షిణాది రాష్ర్టాలకు కూలీలు, కార్మికుల వలసలు నిరంతరాయంగా సాగిపోతున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించిన గణాంకాలు అనుకూలంగా ఉన్నట్టు కేంద్రం పదేపదే వివిధ సంస్థల ద్వారా ప్రకటనలు గుప్పిస్తున్నది. అయితే, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెద్దగా రావడం లేదు.
ఇందిర, రాజీవ్‌గాంధీ వంటి కాంగ్రెస్ ప్రధానుల హయాంలో కొన్ని పారిశ్రామిక గ్రూపులకే లాభం చేకూరే కేంద్ర పాలసీలను అమలు చేసి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని బలోపేతం చేసిన విషయాన్ని జనం ఇంకా మర్చిపోలేదు. అదేవిధంగా బీజేపీకి భారీ మొ త్తాల్లో నిధులు సమకూర్చే పారిశ్రామిక గ్రూపు లు 2014 నుంచి తమ సంపదను ఎంత వేగంగా, ఎంత భారీగా పెంచుకోగలిగాయో గమనిస్తే కేంద్ర పాలకుల పోకడలు అర్థమవుతాయి. యూపీ, బిహార్ సహా అనేక ఉత్తరాది రాష్ర్టాల్లో సాగు సన్నగిల్లడంతో ఈ ప్రాంతాల నుంచి దక్షిణాది రాష్ర్టాలకు కూలీలు, కార్మికుల వలసలు నిరంతరాయంగా సాగిపోతున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించిన గణాంకాలు అనుకూలంగా ఉన్నట్టు కేంద్రం పదేపదే వివిధ సంస్థల ద్వారా ప్రకటనలు గుప్పిస్తున్నది. అయితే, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెద్దగా రావడం లేదు.
నిరుద్యోగం అంచనాలకు మించి పెరిగిపోతున్నది. రాయితీలు, ప్రోత్సాహకాలు వంటి ప్రభుత్వ విధానాల ఫలితంగా లాభాలు గణనీయంగా పెంచుకుంటున్న అనేక కంపెనీలు తమ సిబ్బంది జీతాలు ఆ స్థాయిలో పెంచడం లేదని ఇటీవల ఒక కార్యక్రమంలో మోదీ చెప్పిన మాటలు చర్చకు దారితీశాయి.
ఇదిలావుండగా భారత ప్రభుత్వంపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజా విశ్వాసం తగ్గిపోయిందని ఇటీవల ఒక అంతర్జాతీయ సంస్థ జరిపిన సర్వేలో తేలింది. ఎన్డీఏ సర్కార్‌పై జనం నమ్మకం క్రమంగా సన్నగిల్లుతున్నదని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనుబంధ సంస్థ జనాభా పరిశోధన కేంద్రం పరిశోధకుడు రాఘవ్ గైహా ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. బీజేపీ పాలనలో భారత్ అన్ని రంగాల్లో ఎంతటి సంక్షోభం ఎదుర్కొంటున్నదనే విషయం ఆయన ప్రకటన రుజువు చేస్తున్నది.
నాంచారయ్య మెరుగుమాల
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

