గర్జిచింనా బీఆర్ఎస్
నగరంలోని విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్న కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. కూకట్‌పల్లిని ట్రక్ పార్కు భూముల వేలానికి వ్యతిరేకంగా వామపక్ష నేతలతో కలిసి గులాబీ శ్రేణులు బుధవారం చేపట్టిన హెచ్ఎండీఏ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
- భూములు అమ్మొద్దు..
- ట్రక్ పార్కు వేలంపై హెచ్ఎండీఏ ముట్ట ఢీ
- హెచ్ఎండీఏ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం
- నేతలను అడ్డుకున్న పోలీసులు.. రణరంగంగా మారిన అమీర్‌పేట
- రహదారిపై బైఠాయించి నిరసన.. తోపులాటలో ఎమ్మెల్యేకు గాయాలు
- బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులతో సహా పలువురి అరెస్టు
- ప్రజా పోరాటం ఆగదు.. రానున్న రోజుల్లో వారే గుణపాఠం చెబుతారు
- న్యాయ పోరాటంతో ట్రక్ పార్కు స్థలాన్ని కాపాడుకుంటాం
- ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందులు
- కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేకానంద్
సిటీబ్యూరో/కేపీహెచ్‌బీకాలనీ:నగరంలోని విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్న కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. కూకట్‌పల్లిని ట్రక్ పార్కు భూముల వేలానికి వ్యతిరేకంగా వామపక్ష నేతలతో కలిసి గులాబీ శ్రేణులు బుధవారం చేపట్టిన హెచ్ఎండీఏ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరకంగా నినాదాలు చేస్తూ.. ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ క్రమంలో నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వలంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో పాటు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, వామపక్ష నేతలను అరెస్టు చేసిన పోలీసులు.. వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. కాగా, ట్రక్ పార్కు భూములను ప్రజల అవసరాలకు కేటాయించాలని కోరితే.. కనీసం ప్రజల మాటలను వినేవారే కరువయ్యారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తన గొంతును నొక్కినంతమాత్రానా.. ప్రజా పోరాటం ఆగదని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన విధంగా గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. న్యాయపోరాటంతో ట్రక్‌పార్కు స్థలాన్ని కాపాడుకుంటామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.

సిటీబ్యూరో, నవంబర్ 25(నమస్తే తెలంగాణ) :నగరంలోని విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ, కూకట్ పల్లిలోని ట్రక్ పార్కు భూముల వేలానికి వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి బీఆర్ ఎస్ చేపట్టిన హెచ్ ఎండీఏ కార్యాలయం ముట్టడితో అమీర్‌పేట రణరంగంగా మారింది. కూకట్ పల్లి హుడా ట్రక్ పారు కు భూములను ఈ నెల 27న చేపట్టే ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎండీఏ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీగా చేరుకున్న స్థానికులు, బీఆర్ఎస్ , వామపక్ష పార్టీల నాయకులను అరెస్టులతో ప్రభుత్వం ఆందోళనను అణచివేసే ప్రయత్నం చేసింది.
ముట్టడి పిలుపు నేపథ్యంలో ఉదయం నుంచే అమీర్ పేట, మైత్రివనం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెచ్ ఎండీఏ కార్యాలయానికి దారితీసే మార్గాల్లో బారికేడ్లు పెట్టి, పలువురు నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో పాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలు వేర్వేరు మార్గాల ద్వారా హెచ్ ఎండీఏ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

రోడ్డుపై బైఠాయింపు..
కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేతలు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్తూ వాహనాల్లోకి ఎకించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ తోపులాటలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు స్వల్ప గాయాలయ్యాయి. అరెస్టయిన వారిలో మాధవరం కృష్ణారావు, శంభీపూర్ రాజులతో పాటు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ట్రక్ పార్ బాధితులు, వామపక్ష నేతలు ఉన్నారు. వీరిని పోలీసులు వివిధ స్టేషన్లకు, క్యాంపు కార్యాలయాలకు తరలించారు. నిరసనకారులు ప్రధాన రహదారిపై బైఠాయించడంతో అమీర్ పేట-మైత్రీవనం మార్గంలో సుమారు అరగంటకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి తరలించిన అనంతరం ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రాకపోకలను క్రమబద్ధీకరించారు.

ట్రక్ పార్కు భూములు అమ్మితే జాతీయ రహదారిపైకి లారీలు
వారం రోజులుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ట్రక్ పార్కు వద్ద నిరాహార దీక్షలు, రిలే దీక్షలు, కాలనీ సంఘాల సంతకాల సేకరణ చేపట్టినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతోనే ముట్టడికి దిగాల్సి వచ్చిందని నేతలు తెలిపారు. ప్రస్తుతం ట్రక్ పార్కులో నిత్యం సుమారు 500కు పైగా భారీ వాహనాలు పార్ చేస్తున్నారని, ఈ భూమిని అమ్మితే ఆ లారీలన్నీ ముంబై జాతీయ రహదారి, కూకట్ పల్లి-బాలానగర్ అంతర్గత రోడ్లపై నిలపాల్సి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ మరింత నరకప్రాయంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ భూములపై రైతులు, దళితుల హకులు, న్యాయపరమైన చికులు ఉన్నాయని, వేలంలో భూములు కొనుగోలు చేసే సంస్థలు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురోవాల్సి వస్తుందని విపక్ష నేతలు స్పష్టం చేశారు.
నా గొంతు నొక్కినా..ప్రజా పోరాటం ఆగదు మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే
హెచ్ఎండీఏ ట్రక్‌పార్కు భూములను ప్రజల అవసరాలకు కేటాయించాలని కోరితే.. కనీసం ప్రజల మాటలను వినేవారే కరువయ్యారు. రేవంత్ సర్కార్ హెచ్ఎండీఏ ఆధీనంలోని ట్రక్‌పార్కు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకానికి పెట్టింది. ఇక్కడ ఉన్న భూమిని అమ్మితే భవిష్యత్‌లో కూకట్పల్లి ప్రజలకు కనీస అవసరాలకు స్థలం లేకుండా పోతుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే ఒక్క కారణంతో భూమిని అమ్మడం సరికాదు. త్వరలోనే కూకట్పల్లి జనాభా 10 లక్షలకు చేరుతుంది. వారికి పార్కులు, క్రీడాప్రాంగణాలు వంటి వసతులు ఎలా కల్పిస్తారు. నిరాహార దీక్షలు చేసినా స్పందించపోవడంతో గోడు చెప్పుకొనేందుకు హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చాం. కానీ..ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ప్రజలందరిని అరెస్ట్ చేయడం బాధాకరం. నా గొంతును నొక్కినంతమాత్రానా ప్రజా పోరాటం ఆగదు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన విధంగా గుణపాఠం చెప్పడం ఖాయం.

సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు
కూకట్పల్లి ట్రక్ పార్ భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ నియంతలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములను విక్రయించే కుట్ర చేస్తోంది. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని విలువైన స్థలాలను అమ్మేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కంచె గచ్చిబౌలి భూములను ముంబై మారెట్లో తాకట్టు పెట్టారు. మియాపూర్‌లోని విలువైన భూములను విక్రయిస్తున్నారు. మెట్రో సంస్థను బలవంతంగా బెదిరించి విలువైన మెట్రో భూములను సైతం ప్రభుత్వం లాకుంటోంది. ట్రక్ పార్ భూముల వేలం ప్రతిపాదనను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ, ప్రజల పక్షాన నిలిచిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇచ్చిన ఉద్యమ పిలుపునకు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అవసరమైతే న్యాయ పోరాటం చేసి ట్రక్ పార్కు భూములను కాపాడుకుంటాం.
ఎర్రబెల్లి సతీశ్‌రావు, సీనియర్ నాయకులు
వేలాన్ని రద్దు చేయాలి
ప్రజా అవసరాల కోసం కేటాయించిన కూకట్పల్లి ట్రక్ పార్ భూముల వేలాన్ని తక్షణమే రద్దు చేయాలి. విలువైన ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అఖిలపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు ఇతర ప్రజాప్రతినిధుల గొంతు నొక్కేందుకు పోలీసు బలగాలను ప్రయోగించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం. ట్రక్ పార్ భూముల వేలాన్ని రద్దుచేయాలి.
పాటిమీది జగన్మోహన్ రావు,
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్
సీఎం రేవంత్‌రెడ్డిది ద్వంద్వ వైఖరి
ప్రభుత్వం భూముల అమ్మకంపై సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి రాగానే యూనివర్సిటీ భూములు, పరిశ్రమల భూముల అమ్మకానికి పెట్టాడు. కూకట్‌పల్లిలో ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన ట్రక్‌పార్కు భూములు, మియాపూర్ భూములను అమ్ముతూ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు. సర్కార్ భూములను అమ్మితేనే ప్రభుత్వం నడుస్తుందని చెప్పుకోవడం సిగ్గు చేటు. ప్రజాభిష్టాన్ని గౌరవించి ట్రక్‌పార్కు భూములను అమ్మడాన్ని విరమించుకోవాలి.
వివేకానంద్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

