ట్రక్పార్ భూముల వేలం వద్దు
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని హుడా ట్రక్పార్ భూములను వేలం వేయొద్దని, ప్రజల ఆస్తిని కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టొద్దని బీఆర్ఎస్, వామపక్ష నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
- ప్రజల ఆస్తిని కార్పొరేట్లకు కట్టబెట్టొద్దు..
- ఆ భూముల పరిరక్షణకు పోరాడుతం
- బీఆర్ఎస్, వామపక్ష నేతల హెచ్చరిక
- జీహెచ్ఎంసీ కార్యాలయ ముట్టడి.. ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా పలువురి అరెస్ట్
- తోపులాటలో ఎమ్మెల్యేకు గాయాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కూకట్‌పల్లిలోని హుడా ట్రక్పార్ భూములను వేలం వేయొద్దని, ప్రజల ఆస్తిని కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టొద్దని బీఆర్ఎస్, వామపక్ష నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 27న హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న ట్రక్‌పార్క్ భూముల ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్, వామపక్షాల ఆధ్వర్యంలో అమీర్‌పేటలోని జీహెచ్ఎంసీ కార్యాలయ ముట్టడికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ మేరకు ఉదయం నుంచే అమీర్‌పేట, మైత్రీవనం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ కార్యాలయ దారుల్లో బారికేడ్లు పెట్టి అక్కడికి వచ్చే నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయసాగారు.
పోలీసు వలయాన్ని ఛేదించుకొని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ మేడ్చల్-మలాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలు వేర్వేరు మార్గాల ద్వారా హెచ్ఎండీఏ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు. ఈ సమయంలో కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకొన్నది. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సమయంలో ఆందోళనకారులను బలవంతంగా పోలీసులు ఈడ్చుకెళ్తుండగా, తోపులాటలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆయనతోపాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, వామపక్ష పార్టీల నేతలు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ట్రక్‌పార్కు బాధితులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
నగరాన్ని అమ్మేసే కుట్ర: మాధవరం, రాజు
సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నగరాన్ని అమ్మేసే కుట్రలకు పాల్పడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆరోపించారు. హైదరాబాద్ నగరంలోని విలువైన ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయవద్దని డిమాండ్ చేశారు. ట్రక్పార్ భూమి వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణారంగ కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. ట్రక్పార్ కోసం గతంలో రైతులు, దళితులు తమ పొలాలను త్యాగం చేశారని మాధవరం కృష్ణారావు గుర్తుచేశారు. 2005లో నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ఆ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తే బీఆర్ఎస్, వామపక్షాల పోరాటంతో వెనకి తగ్గారని చెప్పారు.
ఇప్పటికే కూకట్‌పల్లిలో రూ.2 వేల కోట్ల విలువైన భూములను అమ్మారని, ఇప్పుడు మరో రూ.5 వేల కోట్ల భూములపై కన్నేశారని మండిపడ్డారు. తనపై, తన కుమారుడిపై కక్షసాధింపు చర్యలకు దిగుతూ అనేక ఇబ్బందులు పెడుతున్నారని, అయినా ప్రజలు ఐదు సార్లు తనను గెలిపించారని, అలాంటి ప్రజల కోసం దేనికైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. ట్రక్పార్ భూములను యథావిథిగా ఉంచాలని, లేదంటే మౌలిక సదుపాయాల కల్పనకైనా వినియోగించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రజల ఆస్తులను బలిపెట్టడాన్ని సహించేది లేదని, ఈ నెల 27న జరగనున్న ఈ-వేలాన్ని అడ్డుకునేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు.
మురికికూపంగా మారుస్తున్నారు: వివేకానంద్
సీఎం రేవంత్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి విలువైన భూములను అమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కంచ గచ్చిబౌలి భూములను ముంబై మారెట్లో తాకట్టు పెట్టారని, మెట్రో సంస్థను బెదిరించి విలువైన భూములను లాకుంటున్నారని, మియాపూర్, కూకట్పల్లి భూములను అమ్ముతూ హైదరాబాద్ నగరాన్ని మురికికూపంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

