Viral News : విద్యార్థులకు ఓ బయాలజీ టీచర్ (Biology Teacher) కండోమ్ క్లాస్ (Condom Class) చెప్పారు. కండోమ్‌ను, కీరదోసను ఉపయోగించి.. కండోమ్ వినియోగంలో చేయకూడని పొరపాట్ల గురించి వివరించారు. సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ‘మానవ పునరుత్పత్తి వ్యవస్థ, ఆరోగ్యం (Human Reproduction System, Health)’ అనే టాపిక్‌ను ఆయన బోధించారు. ఈ టాపిక్‌లో భాగంగా కండోమ్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేశారు. బీహార్ (Bihar) లోని పూర్నియా (Purnia) లోగల ఓ స్కూల్లో జరిగిన ఈ క్లాస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నది. బీహార్‌కు చెందిన చందన్ కుమార్ పండిత్ అనే బయాలజీ టీచర్ ఈ క్లాస్ చెప్పారు. ఆయన తనను తాను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఇండియాస్ వైరల్ బయాలజీ సర్’ గా పరిచయం చేసుకుని తన క్లాస్‌లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఇప్పుడు ఆయన పోస్ట్ చేసిన కండోమ్ క్లాస్ వీడియో కొన్ని నిమిషాల్లోనే లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. పుస్తకాల్లోని చదువుతోపాటు ఇలాంటి సున్నితమైన అంశాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రాక్టికల్ అవగాహన కల్పించడం ఎంతో అవసరమని చందన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
కండోమ్ వినియోగంతో ఉండే ప్రయోజనాలు, వినియోగంలో చేయకూడని పొరపాట్లు, జనాభా నియంత్రణలో, సుఖ వ్యాధుల నియంత్రణలో కండోమ్‌ల పాత్ర గురించి ఆ బయాలజీ టీచర్ వివరించిన విధానాన్ని పలువురు సమర్థిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఆ టీచర్ తీరును తప్పుపడుతున్నారు. కండోమ్ వినియోగం గురించి కీరదోసను ఉపయోగించి మరీ అంత వివరించాల్సిన అవసరం లేదని విమర్శిస్తున్నారు. ఇదిలావుంటే పునరుత్పత్తి ఆరోగ్యంపై తరగతి గదిలో బోధించే పద్ధతులపై ఈ వీడియో కొత్త చర్చకు దారితీసింది.