Bihar MLA Anant Singh | కుమార్తె పెళ్లి సందర్భంగా గుర్రపు పోటీలు.. విజేతకు ‘థార్’ బహుకరించనున్న ఎమ్మెల్యే
Bihar MLA Anant Singh | ఒక ఎమ్మెల్యే తన కుమార్తె పెళ్లి సందర్భంగా గుర్రపు పందెం పోటీలు ఏర్పాటు చేశారు. విజేతకు ‘థార్’ వాహనాన్ని బహుకరించనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఈ పోటీలో పాల్గొనేందుకు పలువురు ఔత్సాహికులు తమ గుర్రాలతో అక్కడకు చేరుకుంటున్నారు.
పాట్నా: ఒక ఎమ్మెల్యే తన కుమార్తె పెళ్లి సందర్భంగా గుర్రపు పందెం పోటీలు ఏర్పాటు చేశారు. విజేతకు ‘థార్’ వాహనాన్ని బహుకరించనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఈ పోటీలో పాల్గొనేందుకు పలువురు ఔత్సాహికులు తమ గుర్రాలతో అక్కడకు చేరుకుంటున్నారు. (Bihar MLA Anant Singh) నవంబర్ 25న బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగికి, కమాండెంట్ రణ్విజయ్ కుమార్ కుమారుడైన అంకిత్ అలియాస్ రిషికేష్ కుమార్‌తో పెళ్లి జరుగనున్నది. అయితే తన కుమార్తె పెళ్లి వేడుక సందర్భంగా ఎమ్మెల్యే అనంత్ సింగ్, గుర్రపు పందెం పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో గెలిచిన వ్యక్తికి ‘థార్’ వాహనాన్ని బహూకరిస్తానని ఆయన ప్రకటించారు.
కాగా, నవాడాలోని గ్రౌండ్లో గుర్రపు పోటీల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఈ పందెం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక జాతుల గుర్రాలు ఇక్కడకు తరలివస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 50 గుర్రాలు చేరుకున్నాయి. ఈ పోటీలో 200కు పైగా గుర్రాలు పాల్గొంటాయని నిర్వాహకులు భావిస్తున్నారు. అలాగే ఈ హార్స్ రేస్‌లో ప్రత్యేకమైన రెండు కాళ్లు పైకి ఎత్తి గుర్రాలు పరుగెత్తడాన్ని చూసేందుకు ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.
మరోవైపు జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) కార్యకర్త దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో డిసెంబర్ 1లోగా లొంగిపోవాలని మోకామా ఎమ్మెల్యే, మాజీ డాన్ అయిన అనంత్ సింగ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే అనంత్ సింగ్, మాజీ ఎమ్మెల్యే అయిన ఆయన భార్యను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ (యునైటెడ్) అక్టోబర్‌లో బహిష్కరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar MLA Anant Singh | కుమార్తె పెళ్లి సందర్భంగా గుర్రపు పోటీలు.. విజేతకు ‘థార్’ బహుకరించనున్న ఎమ్మెల్యే
Harihara Putra | అయ్యప్ప భక్తి నేపథ్యంలో వైభవ్ ‘హరిహర పుత్ర’.. ఆకట్టుకుంటున్న టీజర్!
Komatireddy Rajagopal Reddy | ఖబడ్దార్ బిడ్డా యుద్దం స్టార్ట్ అయితది.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్
Donald Trump: ట్రంప్‌ను హత్తుకున్న జిన్‌పింగ్.. చైనాకు ఎన్విడియా చిప్స్ బంద్
Dogra Front | లష్కరే ఉగ్రవాది ఎన్కౌంటర్.. జమ్ముకశ్మీర్‌లో డోగ్రా ఫ్రంట్ సంబురాలు.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

