Komatireddy Rajagopal Reddy | ఖబడ్దార్ బిడ్డా యుద్దం స్టార్ట్ అయితది.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్
Komatireddy Rajagopal Reddy | అధికారముందని నేను ఏం చేసినా నడుస్తదనుకుంటే మాత్రం.. ఖబడ్ధార్ బిడ్డా రేవంత్ రెడ్డికి చెప్తున్నాయుద్ధం మొదలైతది.. అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Komatireddy Rajagopal Reddy | కాంగ్రెస్ సర్కార్ లోపాలను, పనితీరును ఎండగట్టే సొంత పార్టీ నేతల్లో ముందు వరుసలో ఉంటారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో రేవంత్ రెడ్డిపై పలు సార్లు ఫైర్ అయిన ఈ సీనియర్ నేత మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి.. అధికారముంది కదా అని నేనేం ఏది చేసినా నడుస్తనుకుంటే మాత్రం ఖబడ్ధార్ బిడ్డా చెప్తున్నా యుద్దం స్టార్ట్ అయితని హెచ్చరించారు. మూడేళ్ల పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరన్నారు.
తెలంగాణ అంటే ఒక కొడంగల్, మధిర నియోజకవర్గాలే కాదు.. ఇక్కడున్న పాలకులు మరొక్కసారి తప్పు చేస్తే మాత్రం అటువంటి నిర్ణయానికి కూడా నేను వెనుకకు పోను.. నేను పదవుల కోసం పని చేసే మనిషిని కాదు.. నువ్వు 1000 కోట్ల కాంట్రాక్టు కాదు.. 5000 కోట్ల కాంట్రాక్టు ఇస్తానన్నా.. నువ్వు ఎంతకిస్తవో చెప్పు. ముఖ్యమంత్రి.. దానికంటే 20 శాతం తక్కువకే నేను పనులు చేపిస్తా. నేను ఈ ప్రజల సొమ్ము కాపాడే మనిషిని కానీ.. ప్రజల సొమ్మును తినే మనిషిని కాదు.. నేను కమీషన్లు ఇయ్యాను.. తీసుకోనన్నారు.
ఏ సొమ్మైనా అది ప్రజల సొమ్ము.. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారంతా కూడా ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలని హితవు పలికారు.. ఒక్క రూపాయి వృధా చేసినా కానీ తెలంగాణ ప్రజల సొమ్ము కాపాడేందుకు ఈ మునుగోడు నుంచి రాజన్న సైన్యం మొత్తం కదులుతదని హెచ్చరించారు. ఆషామాషీ కాదు..అధికారముందని నేను ఏం చేసినా నడుస్తదనుకుంటే మాత్రం.. ఖబడ్ధార్ బిడ్డా చెప్తున్నాయుద్ధం మొదలైతది.. ప్రజల సొమ్ము దోచుకున్నా.. ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి.. నీకు అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ బిడ్డా, యుద్ధం స్టార్ట్ అవుతది
రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మూడేళ్ల పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు
తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమే కాదు
ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి
ప్రజల సొమ్ము తినే మనిషిని కాదు రేవంత్ రెడ్డి
కాంట్రాక్ట్ టెండర్ ఎంతో చెప్పు దాని కంటే 20 శాతం తక్కువే టెండర్ వేస్తా.. ప్రజల సొమ్ము కాపాడుతా
– కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Komatireddy Rajagopal Reddy | ఖబడ్దార్ బిడ్డా యుద్దం స్టార్ట్ అయితది.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్
Donald Trump: ట్రంప్‌ను హత్తుకున్న జిన్‌పింగ్.. చైనాకు ఎన్విడియా చిప్స్ బంద్
Dogra Front | లష్కరే ఉగ్రవాది ఎన్కౌంటర్.. జమ్ముకశ్మీర్‌లో డోగ్రా ఫ్రంట్ సంబురాలు.. Video
Robert Pattinson | రాబర్ట్ స్టార్ హీరో కనుకే తొలుత వ్యతిరేకించాం.. జేమ్స్ బాండ్ ఎంపికపై జెఫ్ బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jobs | నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో 145 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

