లక్నో: ముగ్గురు మహిళలు కొనుగోలు పేరుతో ఒక బట్టల షాపులోకి ప్రవేశించారు. అయితే సుమారు పది వేల విలువైన లోదుస్తులను వారు చోరీ చేశారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Women Stealing Undergarments) ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 24న సాయంత్రం 7 గంటల సమయంలో లాహురాబిర్ ప్రాంతంలోని ఒక క్లాత్ షోరూమ్‌కు ముగ్గురు మహిళలు వచ్చారు. ఒక మహిళ సేల్స్ సిబ్బంది దృష్టిని మళ్లించింది. మరో ఇద్దరు మహిళలు బ్రాలు, ప్యాంటీలను చోరీ చేసి తమ బ్యాగ్స్‌లో దాచారు. ఆ తర్వాత ఆ ముగ్గురూ ఆ షాపు నుంచి వెళ్లిపోయారు.
కాగా, షాపు సిబ్బంది స్టాక్ తనిఖీ చేయడంతోపాటు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దీంతో సుమారు పది వేల విలువైన లోదుస్తులను ఆ ముగ్గురు మహిళలు చోరీ చేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మహిళలు లోదుస్తులు చోరీ చేయడంపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేశారు. ఒక మహిళను వ్యాపార మండలి అధ్యక్షురాలిగా పేర్కొన్నారు. ‘ద్రవ్యోల్బణం ఎంతగా పెరిగిందంటే లోదుస్తులు కూడా దొంగిలించేంతగా’ అని మరొకరు చమత్కరించారు.
Utterly Shameful! 😡
In Varanasi, Uttar Pradesh, three women visited a clothing showroom. Two of them were caught stealing undergarments. CCTV footage identified the third woman as Sunita Soni, president of the Women Traders Association, Varanasi.
Sunita’s defense? She claimed,… pic.twitter.com/ZVuA3Y566y— The Nalanda Index (@Nalanda_index) February 26, 2026
Also Read:
Fake ED Raid | యజమాని ఇంటిపై.. నకిలీ ఈడీ రైడ్ చేయించిన పనిమనిషి
Sunetra Pawar | అజిత్ పవార్ మరణించిన నెల తర్వాత.. ఎన్సీపీ అధ్యక్షురాలిగా సునేత్రా
Watch: ఆలయ ఉత్సవంలో ఏనుగు అలజడి.. వ్యక్తిపై తొండంతో దాడి