Sunetra Pawar | అజిత్ పవార్ మరణించిన నెల తర్వాత.. ఎన్సీపీ అధ్యక్షురాలిగా సునేత్రా
Sunetra Pawar | విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ భార్య, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. భర్త చనిపోయిన సరిగ్గా నెల తర్వాత ఆయన స్థానాన్ని ఆమె భర్తీ చేశారు.
ముంబై: విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ భార్య, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ (Sunetra Pawar) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. భర్త చనిపోయిన సరిగ్గా నెల తర్వాత ఆయన స్థానాన్ని ఆమె భర్తీ చేశారు. పార్టీ వర్కింగ్ నేషనల్ ప్రెసిడెంట్‌గా నియమితులైన ప్రఫుల్ పటేల్ ఈమేరకు ప్రకటించారు. ఎన్సీపీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఎన్నికను పార్టీ కార్యనిర్వాహక కమిటీ అధికారికంగా ఆమోదించినట్లు వెల్లడించారు.
కాగా, జనవరి 28న అజిత్ పవార్ ముంబై నుంచి ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణించారు. ల్యాండింగ్ సమయంలో బారామతిలో ఆ విమానం కూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు మహిళా పైలట్లు, అజిత్ భద్రతా సిబ్బందితో సహా ఐదుగురు మరణించారు.
మరోవైపు అజిత్ పవార్ మరణించిన 13 రోజుల్లోనే ఆయన భార్య సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్ నిర్వహించిన ఆర్థిక శాఖ తప్ప రాష్ట్ర ఎక్సైజ్ సుంకం, క్రీడలు, యువజన వ్యవహారాలు, మైనారిటీల అభివృద్ధి, ఔకాఫ్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఎన్సీపీ చీఫ్‌గా కూడా సునేత్రా పవార్‌ను పార్టీ ఎన్నుకున్నది.
Also Read:
self-styled godman kisses Girl | దేవుడిగా చెప్పుకునే వ్యక్తి బాలిక పట్ల అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు
Watch: ఆలయ ఉత్సవంలో ఏనుగు అలజడి.. వ్యక్తిపై తొండంతో దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

