Kiruthiga Udhayanidhi : సినీ నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డింఎకే ఎమ్మెల్యే, తమిళనాడు విపక్షనేత ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin)కు సంబంధించిన ఓ వీడియో వైరలవుతోంది. కావేరీ జలాల గురించి మాట్లాడుతూ.. త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థం వచ్చే లా మాట్లాడిన స్టాలిన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయన భార్య కిర్తిగ ఉదయనిధి.. మా ఆయన టాయిలెట్లో ఉన్నాడు. కాసేపు ఆగండి అని పోలీసులతో వాగ్వాదం చేసింది. పోలీసులతో ఆమె వాదించిన వీడియో బయటకొచ్చింది.
కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరి జలాల విడుదల కోసం పట్టుపడుతున్న డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ అనూహ్యంగా అరెస్టయ్యారు. సమావేశంలో డీఎంకే అభిమానులు త్రిష.. త్రిష అని అరవడంతో… ఎక్కడ నీళ్లు లేకున్నా అక్కడ మాత్రం నీళ్లు కావాలి అని కామెంట్ చేయడంతో పెద్ద దుమారం రేగింది.
టీవీకే నాయకులు, ఆ పార్టీ మహిళా ప్రతినిధులు ఉదయనిధి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ను ఆశ్రయించారు. దాంతో, పోలీసులు ఉదయనిధి స్టాలిన్ను చెన్నైలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన భార్య కిర్తిగ ఉదయనిధి వాదనకు దిగారు.
“ஒரு 10 நிமிஷம் மட்டும் டைம் கொடுங்க, காலைக்கடனை முடிக்காமல் உதயநிதியால் எப்படி வர முடியும்?”
“10 நிமிஷம் 10 நிமிஷம்னு எவ்ளோ நேரம் சொல்லுவீங்க உடனே வந்து அவர கைதாவ சொல்லுங்க..” உதயநிதியை கைது செய்ய வந்த இணை ஆணையர் விஜயகுமாரிடம் கிருத்திகா, மா.சுப்பிரமணியன் பேச்சுவார்த்தை#DMK |… pic.twitter.com/85TqNOtRet
— Polimer News (@polimernews) August 4, 2026
‘మా అయన టాయిలెట్లో ఉన్నారు. కొంత సమయం ఇవ్వండి’ అని ఆమె పోలీసులతో అన్నారు. అందుకు పోలీసులు కుదరదని చెప్పారు. ‘ఎంత సమయం ఎదురుచూడాలి. ఇంకా మేము వేచి ఉండలేం. ఆయన 10 నిమిషాలు, 10 నిమిషాలు అని అంటున్నారు. ఆయనను అదుపులోకి తీసుకోవడం మా పని. మేము చట్టాన్ని అతిక్రమించలేదు. మేము చట్టాన్ని ఉల్లంఘించినట్టు మీరు నిరూపించగలిగితే అప్పుడు మేము అంగీకరిస్తాం. ఆ పరిస్థితి లేనప్పుడు మా ఉద్యోగం మమ్మల్ని చేయనివ్వండి’ అని పోలీస్ అధికారులు ఉదయనిధి భార్యకు తేల్చి చెప్పారు.
With such vulgar and perverse views towards women, Udhayanidhi is unfit to hold a public role, be in the Assembly, or act as an Opposition Leader! 🔥
– Minister @CTR_Nirmalkumar pic.twitter.com/h9h75Ho6R4— George (@georgeviews) August 4, 2026
తమిళనాడు మంత్రి సుబ్రహ్మణ్యం సైతం ఉదయనిధి బయటకు వచ్చేంత వరకూ ఆగండి. ఆయనకు 10 నిమిషాలు ఇవ్వండి అని పోలీసులను కోరారు. ఎట్టకేలకు తమిళనాడు విపక్ష నేతను అరెస్ట్ చేసిన పోలీసులు తంజావూరు తరలించారు. డీఎంకే నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో ఉదయనిధికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.