లక్నో: భార్య ప్రియుడ్ని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. పారిపోయిన అతడ్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో బీడీ వెలిగించిన తర్వాత అతడు లొంగిపోయాడు. దీనికి ముందు భార్యను కూడా చంపుతానని ఒక వీడియోలో హెచ్చరించాడు. (man kills wife’s lover) ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం మీరట్‌లోని రద్దీ మార్కెట్ ప్రాంతమైన రామ్రాజ్లో బైక్‌పై వెళ్తున్న 28 ఏళ్ల సురేంద్ర అలియాస్ సునీల్‌పై ముసుగు వేసుకున్న వ్యక్తి కాల్చి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన భయాందోళన సృష్టించింది.
కాగా, నిందితుడ్ని ప్రదీప్‌గా పోలీసులు గుర్తించారు. ఏడాదన్నర కిందట భార్య అతడ్ని వీడి సురేంద్రతో కలిసి నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న ప్రదీప్ తన భార్య ప్రియుడైన సురేంద్రను కాల్చి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడైన ప్రదీప్ కోసం గాలించారు. గన్‌తో ఒకచోట ఉన్న అతడ్ని చుట్టుముట్టారు. అయితే తాపీగా బీడీ కాల్చిన తర్వాత పోలీసులకు ప్రదీప్ లొంగిపోయాడు.
మరోవైపు భార్య ప్రియుడి హత్యకు ముందు ప్రదీప్ ఒక వీడియో క్లిప్ విడుదల చేశాడు. ఏడాదిన్నరగా పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపించాడు. అందుకే భార్య ప్రియుడిని హత్య చేసినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత తన భార్యను కూడా చంపుతానని హెచ్చరించాడు. ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేయాలని పోలీసులకు సవాల్ చేశాడు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
पुलिस के सामने हत्यारे ने पहले बीड़ी पी फिर हुआ गिरफ्तार#meerutnews #meerut #UttarPradesh #UttarPradeshNews pic.twitter.com/41yqLn29US
— Rajsamand Express (@RajsmdExpress) February 26, 2026
“Pumped 3 bullets into him – a 12 bore, a 32 bore and 315 bore”
“Make this video viral. Send this video to SSP Meerut”
Story from “Ramraj” area in Meerut, Uttar Pradesh. A man identified as Pradeep killed his wife’s paramour Sunil Gaba and confessed it in a video soon after… pic.twitter.com/vq9uHCgvBa
— Piyush Rai (@Benarasiyaa) February 26, 2026
Also Read:
self-styled godman kisses Girl | దేవుడిగా చెప్పుకునే వ్యక్తి బాలిక పట్ల అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు
Watch: ఆలయ ఉత్సవంలో ఏనుగు అలజడి.. వ్యక్తిపై తొండంతో దాడి