Spider Man OTT | ఓటీటీలోకి ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’.. రూ.12 వేల కోట్ల వసూళ్లతో దూసుకెళ్తున్న మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Spider Man OTT | మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU), సోనీ పిక్చర్స్ కాంబినేషన్లో టామ్ హాలండ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
Spider Man OTT | మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU), సోనీ పిక్చర్స్ కాంబినేషన్లో టామ్ హాలండ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలోనూ స్పైడర్ మ్యాన్‌కు ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది. భారత్‌లో ఐమాక్స్ స్క్రీన్లు అందుబాటులో లేకపోయినప్పటికీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తొలి మూడు రోజుల్లోనే సుమారు రూ.309 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కొత్త రికార్డులు నమోదు చేస్తోంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ స్పైడీ దూకుడు కొనసాగుతోంది. విడుదలైన వారం రోజులు పూర్తికాకముందే ఈ చిత్రం 1 బిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్నట్లు తెలుస్తోంది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ తర్వాత ఇంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.12 వేల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే 2 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తున్న ‘బ్రాండ్ న్యూ డే’ ఓటీటీ రిలీజ్‌పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ 2026లో డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే, థియేట్రికల్ రన్ ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై ఓటీటీ విడుదల తేదీ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సినిమా భారీ వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో డిజిటల్ రిలీజ్‌ను కొంత ఆలస్యం చేసే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. సోనీ పిక్చర్స్‌కు సంబంధించిన గ్లోబల్ డిజిటల్ డీల్ ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే భారతదేశానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ విషయంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియాలో మార్వెల్‌కు సంబంధించిన పలు సినిమాలు, ముఖ్యంగా MCU కంటెంట్ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ కూడా అక్కడే స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ‘బ్రాండ్ న్యూ డే’ కూడా భారతీయ ప్రేక్షకుల కోసం జియోహాట్‌స్టార్‌లోకి వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్‌లో ఏ ప్లాట్‌ఫామ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంటుందనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

