Watch: ఊడిపడిన ప్రభుత్వ ఆసుపత్రి స్లాబ్ పెచ్చులు.. మహిళ తలకు తీవ్ర గాయాలు
Government Hospital Celling Collapses | ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ నడుస్తూ వెళ్తున్న ఒక మహిళ తలపై శిథిలాలు పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జైపూర్: ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ నడుస్తూ వెళ్తున్న ఒక మహిళ తలపై శిథిలాలు పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Government Hospital Celling Collapses) రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సుజన్‌గఢ్‌లోని ప్రభుత్వ ఫతేపురియా మాతా శిశు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద సీలింగ్‌లోని ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. అక్కడ నడుస్తూ వెళ్తున్న మహిళపై శిథిలాలు పడ్డాయి. తలకు తీవ్రగాయమైన ఆమెను ప్రభుత్వ బగాడియా సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ప్రభుత్వ ఆసుపత్రి సీలింగ్ పెచ్చులు ఊడిపడటం చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. ఆ ఆసుపత్రి పాత భవనం శిథిలావస్థకు చేరడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఇన్ఛార్జ్ డాక్టర్ బన్షీధర్ ఈ సంఘటనపై స్పందించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనం గురించి అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అయితే ఆసుపత్రిలోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In Rajasthan’s Churu district, a female patient had come to the government hospital for her treatment and suddenly the plaster of Roof fell off😨 pic.twitter.com/x0h36pU3Yf
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 6, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

