Fake ED Raid | యజమాని ఇంటిపై.. నకిలీ ఈడీ రైడ్ చేయించిన పనిమనిషి
Fake ED Raid | ఇంటి యజమాని డబ్బు, నగలపై పనిమనిషికి కన్నుపడింది. బంధువైన మహిళతో కలిసి కుట్రపన్నింది. వదిన భర్త, అతడి స్నేహితుడితో కలిసి నకిలీ ఈడీ రైడ్ చేయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు.
న్యూఢిల్లీ: ఇంటి యజమాని డబ్బు, నగలపై పనిమనిషికి కన్నుపడింది. బంధువైన మహిళతో కలిసి కుట్రపన్నింది. వదిన భర్త, అతడి స్నేహితుడితో కలిసి నకిలీ ఈడీ రైడ్ చేయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు. (Fake ED Raid) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 11న న్యూ ఫ్రెండ్స్ కాలనీలో నివసించే ఆర్సీ సభర్వాల్, ఉషా దంపతుల ఇంటిపై నకిలీ ఈడీ రైడ్ జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఈడీ అధికారుల పేరుతో ఆ ఇంట్లో సోదాలు చేశారు. ఆ దంపతులు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బీరువాల నుంచి నగదు, నగలను, ఖరీదైన వాచీలను బయటకు తీయించారు.
కాగా, ఉషా వద్ద మరో మొబైల్ ఫోన్ ఉన్నది. టాయిలెట్లోకి వెళ్లిన ఆమె, ఈడీ తరుఫున న్యాయవాదిగా పని చేస్తున్న మనవడైన గౌరవ్‌కు ఫోన్ చేసింది. ఇంట్లో జరిగిన రైడ్ గురించి చెప్పింది. ఆరా తీసిన అతడు నకిలీ రైడ్ అని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఈడీ తరుఫు న్యాయవాది అయిన తన మనవడు వచ్చి మాట్లాడతాడని ఆ వ్యక్తులకు ఆమె చెప్పింది. భయపడిన ఆ ముగ్గురు సుమారు 4 లక్షల డబ్బు, బంగారు ఆభరణాలు, ఏడు ఖరీదైన వాచీలతో పారిపోయారు.
మరోవైపు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేశారు. 300కు పైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. నకిలీ ఈడీ రైడ్ కోసం నిందితులు వినియోగించిన కారును ఘజియాబాద్‌లోని ఒక ఇంట్లో గుర్తించారు. పూజా రాజ్‌పుత్ అనే మహిళను ప్రశ్నించారు. ఆర్సీ సభర్వాల్ ఇంట్లో రెండేళ్లుగా పని చేస్తున్న రేఖ దేవి ఈ కుట్ర పన్నినట్లు తెలుసుకున్నారు. రైడ్ సమయంలో ఆ ఇంట్లో ఉన్న ఆమె వారి ఆస్తుల గురించి సమాచారం ఇచ్చినట్లు బయటపడింది.
అయితే పారామిలిటరీ దళంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పూజ భర్త మనీష్, అతడి స్నేహితుడు ఉపదేశ్, ఫ్రెండ్ కుమారుడు కలిసి నకిలీ ఈడీ రైడ్‌కు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో కుట్ర పన్నిన పనిమనిసి రేఖ దేవి, ఆమె వదిన పూజను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు పురుషుల కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Sunetra Pawar | అజిత్ పవార్ మరణించిన నెల తర్వాత.. ఎన్సీపీ అధ్యక్షురాలిగా సునేత్రా
self-styled godman kisses Girl | దేవుడిగా చెప్పుకునే వ్యక్తి బాలిక పట్ల అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు
Watch: ఆలయ ఉత్సవంలో ఏనుగు అలజడి.. వ్యక్తిపై తొండంతో దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

