హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆదివారం నగరంలోని పలు అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. బోనాల ( Bonalu ) పండుగ సందర్భంగా శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ( Mahankali ) అమ్మవారిని, లాల్ దర్వాజా ( Laldarwaja ) సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, హైదరాబాద్‌లో వ్యాపారాలు బాగా జరగాలని ఆకాంక్షించారు. . అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా పడి, రైతులందరూ సంతోషంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఓల్డ్ సిటీలోని బంగారు మైసమ్మ అమ్మవారిని, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని , నాంపల్లిలోని శ్రీ ఏడు గుళ్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కేటీఆర్ వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు , ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుటు కేటీఆర్‌ను శాలువాతో సత్కరించారు.