ETPL | ఒకట్రెండు కాదు ఐదేసిన ఐదుగురు.. టీ20ల్లో నయా రికార్డు..!
ETPL : టీ20ల్లో బ్యాటర్ల విధ్వంసానికి బలయ్యే బౌలర్లే ఎక్కువ. హిట్టర్ల జోరు ముందు మ్యాచ్‌లో ఒకట్రెండ్ వికెట్లు తీస్తే గొప్ప అనుకునే రోజులివి. అయితే.. కొందరు బౌలర్లు సంచలన ప్రదర్శనతో ఐదేసి వికెట్లు ఔరా అనిపించారు.
ETPL : టీ20ల్లో బ్యాటర్ల విధ్వంసానికి బలయ్యే బౌలర్లే ఎక్కువ. హిట్టర్ల జోరు ముందు మ్యాచ్‌లో ఒకట్రెండ్ వికెట్లు తీస్తే గొప్ప అనుకునే రోజులివి. అయితే.. కొందరు బౌలర్లు సంచలన ప్రదర్శనతో ఐదేసి వికెట్లు ఔరా అనిపించారు. అది కూడా ఒకే ఎడిషన్‌లో ఏకంగా ఐదుగురు ఐదేసి వికెట్లతో రికార్డు నెలకొల్పారు. అలాఅనీ ఐపీఎల్(IPL), బిగ్‌బాష్, కరీబియన్ ప్రమీయర్ లీగ్ వంటి పాపులర్ లీగ్స్‌లో కాదు ఈ ఏడాది మొదలైన యూరోపియన్ లీగ్(ETPL)లోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఇంతకూ ఆ పాంచ్‌పటాకా యోధులు ఎవరంటే..?
తుఫాన్ ఇన్నింగ్స్‌లతో భయపెట్టే చిచ్చరపిడుగుల ఆధిపత్యం కొనసాగుతున్న ఫ్రాంచైజీ క్రికెట్లో బౌలర్ల పైచేయి సాధించడం చాలా తక్కువ. మేటి బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేస్తూ రెండు, మూడు వికెట్లు తీయడమే గొప్ప అనకుంటున్న ఈ రోజుల్లో..ఐదేసి వికెట్లతో హల్చల్ చేశారీ ఐదుగురు.
Most five-wicket hauls in an edition of a men’s franchise T20 league:
𝟓 – 𝐄𝐓𝐏𝐋, 𝟐𝟎𝟐𝟔
4 – IPL, 2011
4 – BPL, 2017
4 – BPL, 2019-20
4 – BBL, 2020-21
4 – BBL, 2021-22
4 – IPL, 2022
4 – IPL, 2023 pic.twitter.com/Di4OW2YNtR— Cricinfo (@cricinfo) September 14, 2026
ఈ ఏడాది షురూ అయిన యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లోనే వీరు ఈ ఫీట్ సాధించారు. ట్రెంట్ బౌల్ట్(5-24), అన్రిచ్ నోర్జి(5-11), మిచెల్ శాంట్నర్(5-16), క్రెగ్ యంగ్(5-21), మైఖేల్ బ్రేస్‌వెల్(5-12)లు ఈ టోర్నీలో బ్యాటర్లను వణికించి ఐదు వికెట్ల ప్రదర్శనతో అబ్బురపరిచారు. అయితే.. వీరిలో క్రెగ్ మినహా.. నలుగురు బౌలర్లు ఐపీఎల్లో మెరిసిన వాళ్లే కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

