Steve Smith | ఇంగ్లండ్‌లో ‘యాషెస్’ ఆడతానో? లేదో.. ఒలింపిక్స్‌లో ఆడాలనుంది..!
Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(Steve Smith) తన భవితవ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో తాను యాషెస్ సిరీస్(Ashes Series)లో ఆడతానో? లేదో? అని అభిమానులకు షాకిచ్చాడీ మాజీ కెప్టెన్.
Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(Steve Smith) తన భవితవ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో తాను యాషెస్ సిరీస్(Ashes Series)లో ఆడతానో? లేదో? అని అభిమానులకు షాకిచ్చాడీ మాజీ కెప్టెన్. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సన్నాహకాల్లో ఉన్న స్మిత్.. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లండ్ పర్యటనపై తనకు గ్యారంటీ లేదని అన్నాడు. అయితే.. రెండేళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆడడంపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పాడీ ఆసీస్ రన్ మెషీన్.
యాషెస్ సిరీస్ అంటే చాలు చెలరేగిపోయే స్టీవ్ స్మిత్ ఇక చాలు అనుకుంటున్నాడు. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో అతడు యాషెస్ ఆడేందుకు సంసిద్ధంగా లేడనిపిస్తోంది. ఈ విషయాన్ని స్మిత్ స్వయంగా వెల్లడించాడు. ‘వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో యాషెస్ సిరీస్ ఆడతానో? లేదో తెలియదు. దీని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. సిరీస్ తర్వాత సిరీస్ లక్ష్యంగా పెట్టుకున్నా. రాబోయే యాషెస్ చాలా దూరంలో ఉందిగా. అయితే.. అక్కడ ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని ఉంది’ అని స్టీవ్ స్మిత్ వెల్లడించాడు.
Steve Smith isn’t sure whether he’ll be playing in next year’s Ashes in England 👀 pic.twitter.com/vmcmClychz
— Cricinfo (@cricinfo) September 14, 2026
కానీ, తనకు ఒలింపిక్స్‌లో ఆడాలని ఉందని అతడు చెప్పాడు. ‘లాస్ఏంజెల్స్ విశ్వ క్రీడల్లో క్రికెట్ పునరాగనం చేయనుంది. టీ20 ఫార్మాట్లో జరుగనున్న క్రికెట్ పోట్లీలో నేను పాల్గొనాలని అనుకుంటున్నా’ అని స్మిత్ పేర్కొన్నాడు. దాంతో.. అతడు ఇకపై పొట్టి క్రికెట్‌పై ఫోకస్ పెట్టే అవకాశముంది అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఫ్యాబ్- 4లో ఒకడైన ఈ ఆసీస్ బ్యాటర్.. టెస్టుల్లో 10వేలకు పైగా పరుగులు సాధించాడు. అతడి పేరిట 37 శతకాలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

