Ramba Oorvasi Menaka | అల్లరి నరేష్ కొత్త సినిమా.. ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ డేట్ ఫిక్స్!
Allari Naresh | టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన సిగ్నేచర్ కామెడీ జోనర్‌తో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమయ్యారు.
Ramba Oorvasi Menaka | టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన సిగ్నేచర్ కామెడీ జోనర్‌తో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ (RambaOorvasiMenaka). ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఒక క్రేజీ అప్డేట్ను విడుదల చేశారు. ఈ సినిమా నుంచి ఆగష్టు 11న టీజర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. టీజర్ డేట్లో మాత్రమే చిన్న సర్దుబాటు… ఎంటర్టైన్మెంట్లో మాత్రం ఎలాంటి సర్దుబాట్లు ఉండవు” అంటూ చిత్ర యూనిట్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ చిత్రానికి సంబంధించిన మోస్ట్ అవేటెడ్ టీజర్ ఆగష్టు 11న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. అల్లరి నరేష్ పాత కామెడీ టైమింగ్‌ను గుర్తుచేసేలా ఈ సినిమా ఉండబోతుందని పోస్టర్లు చూస్తేనే అర్థమవుతోంది.
ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన సురభి (Surbhi) హీరోయిన్గా నటిస్తుండగా, చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా, లెమన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లరి నరేష్ మార్క్ ఫుల్-ఆన్ ఎంటర్టైన్మెంట్తో రాబోతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4, 2026న ఘనంగా విడుదల కానుంది. థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

