Trainer Aircraft Crashes | బారామతిలో కూలిన శిక్షణా విమానం.. అజిత్ పవార్ ప్రమాదం తర్వాత రెండో ఘటన
Trainer Aircraft Crashes | మహారాష్ట్రలోని పూణే జిల్లాలో బారామతి ఎయిర్పోర్ట్ సమీపంలో ఆదివారం ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన శిక్షణా విమానం కూలిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.
ముంబై: మహారాష్ట్రలోని పూణే జిల్లాలో బారామతి ఎయిర్పోర్ట్ సమీపంలో ఆదివారం ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన శిక్షణా విమానం కూలిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. (Trainer Aircraft Crashes) ఏడు నెలల క్రితం బారామతి ఎయిర్‌స్ట్రిప్‌లో విమానం ల్యాండింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో అప్పటి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్‌తో సహా ఐదుగురు మరణించిన తర్వాత తాజాగా ఈ ప్రమాదం జరుగడం విశేషం.
కాగా, ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ప్రైవేట్ కంపెనీకి చెందిన శిక్షణా విమానం కూలిందని పోలీస్ అధికారి తెలిపారు. విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పిందని చెప్పారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందా లేదా మరేవైనా ఇతర సమస్యలు ఉన్నాయా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కార్వర్ ఏవియేషన్ కంపెనీకి చెందిన సెస్నా 172 విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారని, ఈ ప్రమాదంలో వారు స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. విమానానికి స్వల్ప నష్టం జరిగిందని వివరించారు.
మరోవైపు మే 13న బారామతిలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన మరో శిక్షణ విమానం కూడా కూలింది. ఈ ప్రమాదంలో కూడా ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. బారామతి ఎయిర్పోర్ట్ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గోజుబావి గ్రామం సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఆ విమానంలో ఒంటరిగా ఉన్న శిక్షణ పొందుతున్న పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

