CM Rekha Gupta : ఇటీవల ఢిల్లీలోని సత్య నికేతన్ హాస్టల్ భవనం కూలిన ఘటనలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న హాస్టల్ బిల్డింగ్స్ను తనిఖీ చేస్తోంది. ఇదే సమయంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా పదివేల మంది విద్యార్థుల కోసం హాస్టళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మంగళవారం దీనిపై ప్రకటన చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సురక్షితమై, భద్రత కలిగిన హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. అందుబాటు ధరలోనే, విద్యార్థులకు అవసరమైన వసతులతో హాస్టల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో 10,000 మంది విద్యార్థులు ఉండొచ్చన్నారు. ఇప్పటికే హాస్టళ్ల ఏర్పాటు కోసం వివిధ ప్రదేశాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.
Delhi Government has initiated the process to provide safe and affordable hostel accommodation for 10,000 students.
The initiative will cover both girls and boys, with secure campuses and student-friendly facilities that help them focus on their studies and future. Locations are… pic.twitter.com/Qsq2otw4z8
— CMO Delhi (@CMODelhi) September 15, 2026
సత్య నికేతన్ బిల్డింగ్ కూలిన ఘటన నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా మున్సిపల్ అధికారులు నగరవ్యాప్తంగా హాస్టల్స్ భద్రతపై తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా సురక్షితం కాని 34 హాస్టల్ బిల్డింగులను అధికారులు కూల్చేశారు. 17 హాస్టళ్లకు సీల్ వేశారు. దీంతో వందలాది మంది విద్యార్థులు ఉన్నట్లుండి హాస్టల్స్ లేక ఇబ్బందులు పడ్డారు. దీంతో విద్యార్థుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని, వారి కోసం హాస్టల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.