Telangana Express | పెద్దపల్లి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ రారాజుగా పేరుగాంచిన తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు (12723/24) ఐదు దశాబ్దాల మైలురాయిని చేరుకున్నది. 1976 అక్టో బర్ 3న ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రె స్లో సికింద్రాబాద్ – న్యూఢిల్లీ మధ్య తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ రైలు, నేటితో 50 ఏండ్లు పూర్తి చేసుకుని సగ ర్వంగా పరుగులు తీస్తున్నది.
ఆ రోజుల్లో హైదరాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి కేవలం దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉండేది. ప్రయాణికుల డిమాండ్ మేరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, కేంద్ర రైల్వే మంత్రి మధు దండవతే కలిసి సికిం ద్రాబాద్‌లో ఈ రైలును 123/124 నంబ ర్లతో ప్రారంభించారు. మొదట వారానికి 2 రోజులు, 14 బోగీలతో మాత్రమే నడిచేది. అప్పుడు స్టీమ్ ఇంజిన్, ఆ తర్వాత డీజిల్ ఇంజిన్‌తో పరుగులు పెట్టగా.. ప్రస్తుతం విద్యుత్తు ఇంజిన్‌తో నడుస్తున్నది. తొలుత ఐసీఎఫ్ బోగీలతో 2019 వరకు నడిచి, ఆ తర్వాత జర్మన్ టెక్నాలజీ ఎలాచ్‌బీ బోగీ లతో నడుస్తున్నది. 2011 వరకు రైలు నంబర్ 2723/24గా ఉండి, ఆ తరువాత 172/24గా మారింది. 1991లో డెయిలీ రైలుగా మార్చి, బోగీలను 24కి పెంచారు (ప్రస్తుతం ఎలాచ్బిలో 22 గీలు)
ప్రారంభంలో ఈ రైలుకు కేవలం కాజీ పేట జంక్షన్లో మాత్రమే స్టాప్ ఉండేది. ఆ తర్వాత సిర్పూర్ కాగజ్‌నగర్, రామ గుండం, 1991లో అప్పటి మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ కృషితో మంచిర్యాల, ఆ తర్వాత బెల్లంపల్లిలో స్టాప్‌లు ఇచ్చారు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత ఈ రైలు తిరిగే ప్రాంతాలన్నీ తెలంగాణలోనే ఉండటంతో దీని పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. దీంతో 2015 నవంబర్ 15న దీనిని అధికారికంగా తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. విభజన తర్వాత ఏపీకి 2015లో విశాఖ నుంచి 20805/06 నంబర్ కొత్త ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.
ఈ రైలు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ రైలును ఉత్తర తెలంగాణ ప్రయాణికుల కోసం పెద్దపల్లి జంక్షన్లో స్టాప్ కల్పించాలని ఉత్తర తెలం గాణ రైల్వే ఫోరం డిమాండ్ చేస్తున్నది. పెద్ద పల్లిలో స్టాప్ ఇస్తే హైదరాబాద్ వెళ్లే వారికి, వచ్చే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికులు కోరుతున్నారు.