IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే..
IND vs NZ | న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 పరుగులకు అలౌటవ్వగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 39 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసింది.
IND vs NZ | న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 పరుగులకు అలౌటవ్వగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 39 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ అర్ధశతకంతో క్రీజులో నిలవగా.. యశస్వి జైస్వాల్ శతకానికి చేరువగా వచ్చి వెనుదిరిగాడు. దేవదత్ పడిక్కల్ మరో ఎండ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 368 పరుగుల కంటే భారత్ ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది.
368 పరుగుల లక్ష్యంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ శుభారంభం అందించారు. న్యూజిలాండ్ పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 125 పరుగులు జోడించారు. జైస్వాల్ దూకుడుగా ఆడుతూ బౌండరీలతో అలరించగా.. రాహుల్ ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధశతకాలు సాధించారు. భారత్ టెస్టు చరిత్రలో 17 మ్యాచ్‌లు, 30 ఇన్నింగ్స్‌ల తర్వాత తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం నమోదైంది.
ధాటిగా ఆడిన జైస్వాల్ 89 బంతుల్లో 16 ఫోర్లతో 85 పరుగులు చేసి ఔటయ్యాడు. మాట్ హెన్రీ బౌలింగ్‌లో టామ్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పడిక్కల్.. రాహుల్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. రాహుల్ 116 బంతుల్లో ఐదు ఫోర్లతో 52 పరుగులు చేయగా.. పడిక్కల్ 35 బంతుల్లో మూడు ఫోర్లతో 16 పరుగులు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 39 ఓవర్లలో 159/1గా ఉంది.
రాహుల్ ఖాతాలో అరుదైన ఘనత
ఈ అర్ధశతకంతో కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ (సేనా) దేశాల్లో టెస్టు ఇన్నింగ్స్‌లో 50కిపైగా పరుగులు చేసిన భారత తొలి ఓపెనర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌పై టెస్టుల్లో రాహుల్‌కు ఇదే తొలి అర్ధశతకం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే..
NHRC | తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల దుస్థితిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
Vishwambhara | ఎట్టకేలకు ఊపందుకున్న మెగాస్టార్ ‘విశ్వంభర’.. ట్రైలర్ రెడీ, రిలీజ్ డేట్ ఎప్పుడో?
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
జల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

