Palapitta | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు పల్లెల్లో, పొలాల గట్లపై, చెట్ల కొమ్మల్లో, విద్యుత్తు తీగలపై విరివిగా కని పించే పాలపిట్ట సంతతి మారుతున్న పర్యావ రణ పరిస్థితులతో క్రమంగా కనుమరుగవుతు న్నది. దసరా పండుగ సమయంలో పాలపి ట్టను చూడటం శుభప్రదమనే నమ్మకం ఉండ టంతో ఈ పక్షికి తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నది. అందుకే బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు దీనిని తెలంగాణ రాష్ట్ర పక్షిగా అధికారికంగా గుర్తించారు. అయితే గత దశాబ్దకాలంలో వీటిసంఖ్య గణ నీయంగా తగ్గినట్టు పక్షుల సర్వేలు వెల్లడిస్తు న్నాయి.
పట్టణీకరణ, చెట్ల నరికివేత, వ్యవసాయంలో పురుగుమందుల అధిక వినియోగం, ఆవాసాల కొరత, అక్రమంగా పట్టుకోవడం, చైనా మాంజా వంటి అనేక ముప్పులు పాలపి ట్టల మనుగడపై ప్రభావం చూపుతున్నాయి. పాలపిట్టలు సాధారణంగా పాత చెట్ల తొర్రలు,చెట్లలోని ఖాళీ ప్రదేశాల్లో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. అలాంటి చెట్లు తగ్గిపోవ డంతో సంతానోత్పత్తికి అనుకూలమైన ప్రదే శాలు కూడా తగ్గుతున్నట్టు నిపుణులు గుర్తిం చారు. దసరా రోజు సాయంత్రం జమ్మి పూజ అనంతరం పాలపిట్టను చూస్తే విజయాలు, శుభాలు కలుగుతాయని చాలామంది విశ్వసి స్తారు. అందుకే ఈ పక్షి తెలంగాణ సంస్కృ తిలో కేవలం ఒక పక్షిగా కాకుండా దసరా సంప్రదాయంలో భాగంగా మారింది. దసరా సందర్భంగా పాలపిట్టను బోనుల్లో బంధించి ప్రదర్శించడంతో ఉన్న కొద్ది సంఖ్యలోని పాల పిట్టలు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఒకప్పుడు సర్వసాధారణంగా కనిపించిన ఈ పక్షి ఇప్పుడు అరుదుగా కనిపిస్తుండటంతో దీని సంరక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరంఏర్పడిందని అటవీశాఖ అధికారులు, నిపు ణులు పేర్కొంటున్నారు.
పాలపిట్టల ప్రాధాన్యం కేవలం సంప్రదా యాలకే పరిమితం కాదని, ఇవి కీటకాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా వ్యవసా యంలో రైతులకు మిత్రుడిగా ఉపయోగపడు తాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. పంట లకు హాని చేసే వివిధ కీటకాలను తినడం వల్ల పర్యావరణ సమతుల్యతకు ఇవి ఉపయోగప డుతాయి. అందుకే పాలపిట్టల ఉనికి వ్యవ సాయ ప్రాంతాల జీవవైవిధ్యానికి కూడా ముఖ్యమైనదిగా భావించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో గతంలో పాలపిట్టలు కనిపిం చేవి. ఇప్పుడు ఈ ప్రాంతాలు వేగంగా అభి వృద్ధి చెందడంతో వాటి ఉనికి కనుమరుగ య్యిందని నిపుణులు పేర్కొంటున్నారు. హైద రాబాద్ నగరం చుట్టూ పొలాల స్థానంలో టౌన్ షిప్ లు, గేటెడ్ కమ్యూనిటీలు, నిర్మా ణాలు పెరుగడంతో పక్షులకు అవసరమైన చెట్లు, బహిరంగ ప్రదేశాలు తగ్గుతున్నాయి. చెరువుల కాలుష్యం, పెరుగుతున్న వాయు కాలుష్యం, పక్షులకు అనుకూలమైన చెట్లకొ రత వంటి అంశాలు కూడా నగర జీవవైవి ధ్యంపై ప్రభావం చూపుతున్నది. ఫలితంగా పాలపిట్టలతో పాటు ఇతర పక్షుల ఉనికి కూడా తగ్గే పరిస్థితి ఏర్పడుతున్నదని పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాలపిట్టల సంరక్షణకు సహజ ఆవాసాలను కాపాడటం అత్యంత ముఖ్యమని అట వీశాఖ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పాత చెట్లను విచక్ష ణారహితంగా నరకకుండా చూడాలని సూచిస్తున్నారు. స్థానిక జాతుల చెట్లను పెంచా లని, వ్యవసాయంలో పురుగుమందుల వినియోగాన్ని బాధ్యతగా నిర్వహించాలని, చెరువులు-మైదానాలను రక్షించే చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా దసరా సందర్భంగా పాలపిట్టలను పట్టుకోవడం, బోనుల్లో బంధించడం వంటి చర్య లను ప్రజలు అడ్డుకోవాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు. పక్షి కనిపిస్తే దూరం నుంచి స్వేచ్ఛగా చూడాలని, కానీ దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకెళ్లడం లేదా ప్రదర్శనకు పెట్టడం చేయకూడదని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.