The Kerala Story 2 | బాలీవుడ్ నుంచి వచ్చిన ‘ది కేరళ స్టోరీ 2’ (The Kerala Story 2) సినిమా టైటిల్ వివాదం కేరళ హైకోర్టులో మరో మలుపు తిరిగింది. ఈ చిత్ర పేరు నుంచి ‘కేరళ’ అనే పదాలను తొలగించాలని కోరుతూ తాజాగా మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కేరళ రాష్ట్రాన్ని ఉగ్రవాదానికి, మతమార్పిడులకు నిలయంగా చిత్రీకరిస్తూ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా ఈ సినిమా ఉందని పిటిషనర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు కూడా స్పందిస్తూ.. సినిమా విడుదలను వాయిదా వేయగా.. చిత్రబృందం డివిజన్ బెంచ్ నుంచి పర్మిషన్ తెచ్చుకుని విడుదల చేసింది. అయితే ఈ సినిమా విడుదలైన అనంతరం సినిమా టైటిల్ను మార్చాలాంటూ ఒక రిటైర్డ్ సోషల్ సైన్స్ టీచర్, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక మహిళా న్యాయవాది కలిసి పిటిషన్ను వేశారు. కేరళ పేరును టైటిల్లో వాడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా కేరళీయులపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇది కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ప్రచారమని పిటిషన్లో తెలిపారు.
మరోవైపు ఈ సినిమా విడుదలై మిశ్రమ స్పందనలను తెచ్చుకుంది. ప్రస్తుతం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ప్రదర్శనను వ్యతిరేకిస్తూ నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి.