Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Vijay Sethupathy | విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రైన్’. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో, చిత్రబృందం తాజాగా అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసింది.
Train Trailer | విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రైన్’. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో, చిత్రబృందం తాజాగా అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఒక రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన సూపర్‌ఫాస్ట్ రైలులో జరిగే అనూహ్య పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఒకవైపు రైలుకు బ్రేకులు ఫెయిల్ అవ్వడం, మరోవైపు సాయుధ దుండగులు రైలును హైజాక్ చేసి ప్రయాణికులను బందీలుగా పట్టుకోవడంతో పెను ప్రమాదం ముంచుకొస్తుంది. అదే రైలులో ప్రయాణిస్తున్న విజయ్ సేతుపతి, బందీలుగా ఉన్న ప్రయాణికుల ప్రాణాలను ఎలా కాపాడాడు అనేది ట్రైలర్లో అత్యంత ఉత్కంఠభరితంగా చూపించారు.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు శ్రుతి హాసన్, నాజర్, నరైన్, యుగి సేతు, కె.ఎస్. రవికుమార్, సంపత్ రాజ్, కలైయరసన్ మరియు బిగ్‌బాస్ ఫేమ్ త్రిగుణ్ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా నాజర్ విలన్ ఛాయలున్న పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. 2020లో వచ్చిన ‘సైకో’ తర్వాత మిస్కిన్ దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు కథ, దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా మిస్కిన్ స్వయంగా అందించడం విశేషం. వి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ చిత్రం, ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ (U/A) సర్టిఫికెట్ పొంది డిసెంబర్ 4, 2026న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

